ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ లో నైజీరియాకు మూడోస్థానం
ట్యునీసియాపై 1-0తో నైజీరియా విజయం అల్జీరియాతో సెనెగల్ టైటిల్ సమరం ఈజిప్టు వేదికగా గత రెండువారాలుగా సాగుతున్న 32వ ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ టోర్నీ ముగింపు దశకు చేరింది. ఆఫ్రికాఖండంలోని మొత్తం 24 దేశాల జట్లు తలపడుతున్న ఈ గ్రూపు లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో…నైజీరియా మూడో స్థానం దక్కించుకొంది. సెమీస్ లో అల్జీరియా, సెనెగల్… ఆఫ్రికాకప్ సాకర్ సెమీఫైనల్స్ లో అల్జీరియా, సెనెగల్ జట్లు విజయం సాధించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి. […]
- ట్యునీసియాపై 1-0తో నైజీరియా విజయం
- అల్జీరియాతో సెనెగల్ టైటిల్ సమరం
ఈజిప్టు వేదికగా గత రెండువారాలుగా సాగుతున్న 32వ ఆఫ్రికాకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ టోర్నీ ముగింపు దశకు చేరింది.
ఆఫ్రికాఖండంలోని మొత్తం 24 దేశాల జట్లు తలపడుతున్న ఈ గ్రూపు లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో…నైజీరియా మూడో స్థానం దక్కించుకొంది.
సెమీస్ లో అల్జీరియా, సెనెగల్…
కైరోలోని అల్ సలామ్ స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్స్ లో అల్జీరియా 2-1 గోల్స్ తో నైజీరియాను, సెనెగల్ 1-0తో ట్యునీసియాను అధిగమించి టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.
నైజీరియాకు కాంస్యం…
మూడో స్థానం కోసం జరిగిన హోరాహోరీ సమరంలో…నైజీరియా 1-0తో ట్యునీసియాను కంగు తినిపించింది.లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ సంచలన విజయాలు సాధించిన ట్యునీసియా సెమీస్ లో తేలిపోయింది.
కాంస్యపతకం కోసం జరిగిన పోటీలో…నైజీరియా ఆటగాడు ఓడియన్ ఇగాలో ఆట ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సూపర్ గోల్ సాధించాడు.
ఆ తర్వాత ఈక్వలైజర్ కోసం ట్యునీసియా ఎంతగా పోరాడినా…నైజీరియా రక్షణ వలయాన్ని చేదించలేకపోయింది. కాంస్య పతకం పోటీలో గోల్ సాధించిన ఇగాలో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టోర్నీలో ఇగాలోకు ఇది 5వ గోల్ కావడం విశేషం.