క్రిప్టో కరెన్సీపై ఫేస్‌బుక్ వెనుకడుగు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై క్రేజ్ పెరుగుతోంది. బ్యాక్ చైన్ మార్కెట్లో కీలకమైన ఈ కరెన్సీ వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం కలుగుతోందని భావించి పలు దేశాలు నిషేధం విధించాయి. క్రిప్టో కరెన్సీలో భాగమైన ‘బిట్‌కాయిన్’ లావాదేవీలను అమెరికా, కెనడా, ఇండియా వంటి దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. కాగా, బిట్ కాయిన్ తరహాలోనే ‘లిబ్రా’ పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రారంభించాలని ఫేస్‌బుక్ భావించింది. ఆ మేరకు ఇటీవల ప్రకటన కూడా చేసింది. ప్రపంచ […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై క్రేజ్ పెరుగుతోంది. బ్యాక్ చైన్ మార్కెట్లో కీలకమైన ఈ కరెన్సీ వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం కలుగుతోందని భావించి పలు దేశాలు నిషేధం విధించాయి. క్రిప్టో కరెన్సీలో భాగమైన ‘బిట్‌కాయిన్’ లావాదేవీలను అమెరికా, కెనడా, ఇండియా వంటి దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి.
కాగా, బిట్ కాయిన్ తరహాలోనే ‘లిబ్రా’ పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రారంభించాలని ఫేస్‌బుక్ భావించింది. ఆ మేరకు ఇటీవల ప్రకటన కూడా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తమ వినియోగదారులను ఈ కరెన్సీ పరిధిలోనికి తీసుకొని రావాలని అనుకుంది. అయితే ఫేస్‌బుక్ నిర్ణయంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఫేస్‌బుక్ ‘లిబ్రా కరెన్సీ’ ప్రారంభిస్తే ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అక్రమ లావాదేవీలకు నిలయంగా మారే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఇది గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని.. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా కూలదోస్తుందని పలువురు అభిప్రాయం వ్యవక్తం చేశారు.
దీంతో ‘లిబ్రా కరెన్సీ’ ప్రాజెక్టును పక్కన పెట్టాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. కొన్నాళ్ల పాటు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాక.. అందరి భయాందోళనలను తీర్చిన తర్వాతే లిబ్రాను ప్రవేశపెడతామని ఫేస్‌బుక్ తెలిపింది. సంప్రదాయ ఆర్థిక వ్యవస్థతో మాకు పోటీ పడే ఆలోచన లేదని ఒక ప్రకటనలో తెలిపింది.