ప్రపంచకప్ లో స్టార్క్ సరికొత్త రికార్డు

మెక్ గ్రాత్ అత్యధిక వికెట్ల రికార్డు తెరమరుగు 2019 ప్రపంచకప్ లో 27 వికెట్ల మిషెల్ స్టార్క్ వన్డే ప్రపంచకప్ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో…కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సింగిల్ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఉన్న గ్లెన్ మెక్ గ్రాత్ ప్రపంచకప్ రికార్డును… స్టార్క్ ప్రస్తుత ప్రపంచకప్ లో అధిగమించాడు. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొమ్మిది మ్యాచ్ ల్లో 26 వికెట్లు సాధించడం ద్వారా…మెక్ […]

Advertisement
Update:2019-07-12 05:52 IST
  • మెక్ గ్రాత్ అత్యధిక వికెట్ల రికార్డు తెరమరుగు
  • 2019 ప్రపంచకప్ లో 27 వికెట్ల మిషెల్ స్టార్క్

వన్డే ప్రపంచకప్ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో…కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సింగిల్ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఉన్న గ్లెన్ మెక్ గ్రాత్ ప్రపంచకప్ రికార్డును… స్టార్క్ ప్రస్తుత ప్రపంచకప్ లో అధిగమించాడు.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొమ్మిది మ్యాచ్ ల్లో 26 వికెట్లు సాధించడం ద్వారా…మెక్ గ్రాత్ పేరుతో ఉన్న ప్రపంచకప్ రికార్డును సమం చేసిన స్టార్క్… బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లోఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టోను అవుట్ చేయడం ద్వారా 27వ వికెట్ సాధించాడు.

2007 ప్రపంచకప్ లో మెక్ గ్రాత్ 26 వికెట్లు పడగొట్టడం ద్వారా రికార్డు నెలకొల్పితే..ప్రస్తుత ప్రపంచకప్ లో స్టార్క్ 27 వికెట్లతో సరికొత్త రికార్డు సాధించాడు.

ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల రికార్డులు రెండూ కంగారూ బౌలర్ల పేరుతోనే ఉండటం విశేషం.

Tags:    
Advertisement

Similar News