సమంతా v/s సందీప్... సరికొత్త లొల్లి !
‘ఒక అమ్మాయి, ఓ అబ్బాయి డీప్ లవ్‌లో ఉన్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ రిలేషన్షిప్లో ఎమోషన్ కనిపించదు. ఇది నా అభిప్రాయం.’ కబీర్‌సింగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో అన్న మాటలవి. ఈ కామెంట్లపై అటు నెటిజన్లు, ఇటు సినీస్టార్లు స్పందిచడం మొదలు పెట్టారు. తమకు తోచినట్లు కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ సందీప్‌రెడ్డి చేసిన ఈ కామెంట్స్‌పై హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ ద్వారా నెగటివ్ […]
‘ఒక అమ్మాయి, ఓ అబ్బాయి డీప్ లవ్‌లో ఉన్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ రిలేషన్షిప్లో ఎమోషన్ కనిపించదు. ఇది నా అభిప్రాయం.’
కబీర్‌సింగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో అన్న మాటలవి.
ఈ కామెంట్లపై అటు నెటిజన్లు, ఇటు సినీస్టార్లు స్పందిచడం మొదలు పెట్టారు. తమకు తోచినట్లు కామెంట్లు పెడుతున్నారు.
డైరెక్టర్ సందీప్‌రెడ్డి చేసిన ఈ కామెంట్స్‌పై హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ ద్వారా నెగటివ్ రియాక్షన్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు చాలా అసంతృప్తికరంగా ఉన్నాయి అని కామెంట్ చేశారు.
అయితే దీనిపై కొందరు అప్పుడు అర్జున్‌రెడ్డి సినిమా బాగుందని అన్నారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎందుకు పెట్టారని సమంతను నిలదీశారు.
దీంతో అర్జున్ రెడ్డి సినిమా తనకు నచ్చిందని..కానీ డైరెక్టర్ చేసిన కామెంట్స్ తనకు నచ్చలేదని అమె చెప్పుకొచ్చారు. అటు ఆమెకు చిన్మయి కూడా వంత పాడారు. మనకు ఇష్టమైనవారిని కొట్టడం అనే కాన్సెప్ట్ తనకు నచ్చలేదని అన్నారు.
మరోవైపు బాలీవుడ్ విమర్శకులను కూడా సందీప్ చీల్చి చెండాడారు. వీరతా ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగులు అని విమర్శించారు. ప్రముఖ విమర్శకులు తన సినిమాకు రేటింగ్ తక్కువ ఇచ్చారని…. వారికి వయ్ లెన్స్ ఏంటో తన తర్వాత సినిమాలో చూపిస్తానని ఘాటుగా సమాధానం ఇచ్చారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా సందీప్‌ను వెనకేసుకొచ్చారు. అమాయకుడైన ఈ డైరెక్టర్ అన్న మాటలను తాను సమర్ధిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం కబీర్‌సింగ్‌తో పాటు… తన తూటాల్లాంటి మాటలతో సందీప్‌రెడ్డి వంగా బాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు.