27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సెమీస్ లో ఇంగ్లండ్
ఆఖరి రౌండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారీవిజయం వరుస విజయాలతో నాకౌట్ రౌండ్లో ఇంగ్లండ్ రెండో సెమీస్ లో భారత్ తో ఇంగ్లండ్ ఢీ వన్డే ప్రపంచకప్ కు ఐదోసారి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్ 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెమీస్ చేరి సత్తా చాటుకొంది. నెగ్గితీరాల్సిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ ను 119 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది. ప్రపంచ టాప్ […]
- ఆఖరి రౌండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారీవిజయం
- వరుస విజయాలతో నాకౌట్ రౌండ్లో ఇంగ్లండ్
- రెండో సెమీస్ లో భారత్ తో ఇంగ్లండ్ ఢీ
వన్డే ప్రపంచకప్ కు ఐదోసారి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్ 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెమీస్ చేరి సత్తా చాటుకొంది. నెగ్గితీరాల్సిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ ను 119 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
ప్రపంచ టాప్ ర్యాంక్ జట్టుగా టైటిల్ వేటకు దిగిన ఇంగ్లండ్ …వరుసగా రెండు డూ ఆర్ డై మ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా సెమీస్ బెర్త్ సాధించగలిగింది.
పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల చేతిలో వరుస పరాజయాలు పొందిన ఇంగ్లండ్… తన ఆఖరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో దెబ్బతిన్న బెబ్బులిలా పోరాడి.. పవర్ ఫుల్ భారత్, సంచలనాల న్యూజిలాండ్ జట్లను అధిగమించడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
కివీస్ ను ఊదేసిన ఇంగ్లండ్..
ఓపెనర్లు బెయిర్ స్టో- జేసన్ రాయ్ మొదటి వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యం అందించడం ద్వారా 300 స్కోరుకు మార్గం సుగమం చేశారు. ఓపెనర్ బెయిర్ స్టో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.
ఇంగ్లండ్ 8 వికెట్లకు 305 పరుగులస్కోరుతో…న్యూజిలాండ్ ఎదుట 306 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలి..119 పరుగుల ఘోరపరాజయం చవిచూసింది. న్యూజిలాండ్ కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా…ఇంగ్లండ్ కు వరుసగా రెండోవిజయం.
ఈ నెల 11న జరిగే రెండో సెమీఫైనల్లో లీగ్ టేబుల్ రెండో స్థానంలో నిలిచిన భారత్ తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1992 ప్రపంచకప్ లో చివరిసారిగా ప్రపంచకప్ సెమీస్ చేరిన ఇంగ్లండ్…మరో సెమీస్ కోసం 27 ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.