"కాపు" కాస్తే పట్టించుకోరా... " బాబుతో కాపు నాయకులు

“తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ ఆ పార్టీ జెండా మోసింది కాపులే. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భుజాలపై మోసింది కాపులే. కాని పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వ పదవుల్లో కానీ మాకు ప్రాధాన్యత లేదు. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి” ఇవీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సమావేశమైన కాపు నాయకుల వ్యాఖ్యలు. సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా […]

Advertisement
Update:2019-07-02 03:15 IST

“తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ ఆ పార్టీ జెండా మోసింది కాపులే. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భుజాలపై మోసింది కాపులే. కాని పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వ పదవుల్లో కానీ మాకు ప్రాధాన్యత లేదు. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి” ఇవీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సమావేశమైన కాపు నాయకుల వ్యాఖ్యలు.

సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన కాపు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు కాపు నాయకులు తమకు పార్టీలోనూ, గత ప్రభుత్వంలోనూ జరిగిన అవమానంపై మండిపడినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కాపు నాయకులు ఎంతో చేశారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి గౌరవం కాపులకు నేడు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే రెండుసార్లు రహస్యంగా సమావేశమైన కాపు నాయకులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు.

కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన రిజర్వేషన్ పోరాటాన్ని పార్టీలో కొందరు కాపు నాయకుల ద్వారా అణిచివేశారని ఈ సమావేశంలో కొందరు నాయకులు పార్టీ అధ్యక్షుడికి గుర్తు చేసినట్లు చెబుతున్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా…. ఇంతకు ముందెన్నడూ మాట్లాడని విధంగా అధ్యక్షుడితో మాట్లాడినట్లు చెబుతున్నారు.

పార్టీలో ఒకరిద్దరు కాపు నాయకులకే ప్రాధాన్యం కల్పించారని, మిగిలిన వారిని అస్సలు పట్టించుకోలేదని కాపు నాయకులు తమ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

“తెలుగుదేశం పార్టీలో వియ్యంకులదే రాజ్యం. మాజీ మంత్రులు, వియ్యంకులు నారాయణ, గంటా శ్రీనివాసరావు చెప్పిందే చేశారు. మీకు మేము పనికి రాలేదు” అని కాసింత ఘాటుగానే మాట్లాడిన కాపు నాయకులకు…. చంద్రబాబు నాయుడు ఇక ముందు అలా జరగదు అని హామీ ఇచ్చారని చెబుతున్నారు.

అయితే కాపు నేతలు మాత్రం పార్టీలో కొనసాగే అంశంపై హామీ ఇవ్వలేదని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News