నదిలోకి 4వేల మంది మల మూత్రాలు.... ఆ నీటితోనే భక్తుల స్నానాలు

ప్రజావేదిక నిర్మించిన భూమిలో గతంలో దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావు అనే రైతులు లిల్లీపూలు సాగుచేసుకుంటుంటే వాళ్లను మంత్రి నారాయణ, కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ బెదిరించి ఆ భూమిని లాక్కున్నారని ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. తాను కోర్టులో కేసు వేస్తే రెండుసార్లు 60 మందికి నోటీసులు వచ్చినా… ప్రభుత్వం కనీసం కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదన్నారు. ప్రజావేదిక పేరుతో రేకుల షెడ్ వేయించి 10 కోట్లు ఖర్చుపెట్టారంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికారుల […]

Advertisement
Update:2019-06-26 04:35 IST

ప్రజావేదిక నిర్మించిన భూమిలో గతంలో దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావు అనే రైతులు లిల్లీపూలు సాగుచేసుకుంటుంటే వాళ్లను మంత్రి నారాయణ, కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ బెదిరించి ఆ భూమిని లాక్కున్నారని ఎమ్మెల్యే ఆర్కే వివరించారు.

తాను కోర్టులో కేసు వేస్తే రెండుసార్లు 60 మందికి నోటీసులు వచ్చినా… ప్రభుత్వం కనీసం కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదన్నారు. ప్రజావేదిక పేరుతో రేకుల షెడ్ వేయించి 10 కోట్లు ఖర్చుపెట్టారంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

అధికారుల గొంతు కూడా నొక్కేసి నిబంధనలన్నింటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేశారన్నారు. చంద్రబాబు అండదండలతోనే ఇలాంటి నిర్మాణాలు చేసిన 57 మంది… కోర్టు నోటీసులకు కనీసం స్పందించలేదన్నారు. గత ప్రభుత్వంలో కంచే చేనుమేసిందన్నారు.

1884లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ అద్భుతంగా తయారు చేశారని… ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ చట్టానికి సవరణ చేయలేదన్నారు. అలాంటి చట్టాన్ని చంద్రబాబు లాంటి వారు తుంగలో తొక్కారన్నారు. 57 భవనాలను పెద్దపెద్ద వాళ్లు అక్రమంగా కట్టారని… తెలిసో తెలియకో కట్టుకుని ఉన్నా… వాటిని ఖాళీ చేయాలని కోర్టు నుంచి నోటీసులు వచ్చినా స్పందించలేదన్నారు.

ఈ అక్రమ కట్టడాల్లో నాలుగు వేల మంది ఉన్నారని.. కొందరు ప్రకృతి వైద్యం అంటూ ఇక్కడే ఉన్నారన్నారు. ఈనాలుగు వేల మందికి సంబంధించి విసర్జాలు నదిలో కలుస్తున్నాయని… ఆ నీటితోనే కింద దుర్గమ్మ భక్తులు స్నానాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇప్పటికైనా అందరూ ముందుకు వచ్చి అక్రమ కట్టడాలను ఖాళీ చేయాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News