పిన్నులు అమ్ముతూ చిన్నారులు... ఎమ్మెల్యే ఆర్కే ఏం చేశారంటే...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సామాన్యులకు అతి దగ్గరగా ఉంటారన్న పేరు ఉంది. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపుతుంటారు. సేవా భావం ఎక్కువే. తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఇద్దరు చిన్నారులు బూరలు, పిన్నులు అమ్ముకుంటూ కనిపించారు. దాంతో వెంటనే తన కారు ఆపిన ఎమ్మెల్యే ఆ చిన్నారుల వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీశారు. స్కూల్‌కు వెళ్లకుండా ఇలా ఎందుకు చిన్న […]

Advertisement
Update:2019-06-20 12:25 IST

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సామాన్యులకు అతి దగ్గరగా ఉంటారన్న పేరు ఉంది. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపుతుంటారు. సేవా భావం ఎక్కువే.

తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఇద్దరు చిన్నారులు బూరలు, పిన్నులు అమ్ముకుంటూ కనిపించారు. దాంతో వెంటనే తన కారు ఆపిన ఎమ్మెల్యే ఆ చిన్నారుల వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీశారు.

స్కూల్‌కు వెళ్లకుండా ఇలా ఎందుకు చిన్న వయసులోనే పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే తాము చిన్నప్పటి నుంచే పనిలోకి వచ్చామని వారు వివరించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే వారికి చెప్పులు, బట్టలు కొనిచ్చారు. ఆర్ధిక సాయం చేశారు. ఈ వయసులో చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని వివరించారు.

స్కూల్‌కు వెళ్తే ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద 15వేలు ఇస్తుందని… కాబట్టి పని మానేసి స్కూల్‌కు వెళ్లాల్సిందిగా వారికి సూచించారు. స్కూల్‌లో అడ్మిషన్‌ కావాలంటే స్వయంగా తాను వచ్చి మాట్లాడుతానని పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులతోనూ మాట్లాడుతానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తల్లిదండ్రుల అడ్రెస్‌ తీసుకున్నారు ఎమ్మెల్యే ఆర్కే.

Tags:    
Advertisement

Similar News