బీజేపీ గెలుపు గాలివాటమేనా?

పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కొద్దిగా డీలా పడిన తెలంగాణ రాష్ట్ర సమితికి పరిషత్ ఎన్నికల ఫలితాలు మళ్లీ ఊపును తెచ్చాయి. తెలంగాణలో దాదాపు 80 శాతం మండల పరిషత్ లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. 32 జిల్లా పరిషత్ పీఠాలను కూడా సాధించి తనకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పింది. పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఈ రెండు పార్టీలు ఒక్క జిల్లాపరిషత్ ను కూడా సాధించుకోలేకపోయాయి. కాంగ్రెస్ 65 మండలాలను […]

Advertisement
Update:2019-06-11 04:50 IST

పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కొద్దిగా డీలా పడిన తెలంగాణ రాష్ట్ర సమితికి పరిషత్ ఎన్నికల ఫలితాలు మళ్లీ ఊపును తెచ్చాయి.

తెలంగాణలో దాదాపు 80 శాతం మండల పరిషత్ లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. 32 జిల్లా పరిషత్ పీఠాలను కూడా సాధించి తనకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పింది. పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఈ రెండు పార్టీలు ఒక్క జిల్లాపరిషత్ ను కూడా సాధించుకోలేకపోయాయి.

కాంగ్రెస్ 65 మండలాలను గెలుచుకోగలిగితే, బీజేపీ ఎనిమిది మంది ఎంపీపీలతోనే సరిపెట్టుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామని చెప్పుకునే ఈ రెండు పార్టీలకు పరిషత్ ఎన్నికల ఫలితాలు అశనిపాతం వంటివేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ విజయాలు గాలివాటమేనని టీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో తమకు తిరుగు లేదని పరిషత్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయంటున్నారు. ఈ ఊపులో ఆ పార్టీ మరో అడుగు ముందుకు వేసి టీఆర్ఎస్ఎల్పీ లోకి సీఎల్పీ విలీనాన్ని పూర్తి చేసింది. దీని మీద కాంగ్రెస్ ధర్మపోరాటానికి దిగింది. లీగల్ గానూ ఫైట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

వీటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదుగానీ, కాంగ్రెస్ కు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పరిణామాలన్నింటిని టీఆర్ఎస్ తనకు సానుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు
చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అసెంబ్లీలో ఎదురు లేకుండా చూసుకోవడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని ఇంకా బలోపేతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

పార్లమెంటు ఎన్నికలలో ఏడు సీట్లు కోల్పోవడాన్ని ఆ పార్టీ అధిష్టానం తేలికగా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ ను తాము బలహీనపరుస్తుంటే, ఆ స్థానంలోకి బీజేపీ వచ్చి చేరుతుందేమోననే అనుమానం టీఆర్ఎస్ నేతల్లో ఉంది. కేంద్రంలో మోదీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున ఇప్పటికిప్పడు బీజేపీని దెబ్బ తీసేలా వ్యవహరించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే టీఆర్ఎస్ ఈ పరిణామాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని భావిస్తోంది. అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ ను కోలుకోకుండా చేయాలని యోచిస్తోంది.

Tags:    
Advertisement

Similar News