తెలంగాణలో అమెజాన్‌ పెట్టుబడులు

దావోస్‌లో అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నరాష్ట్ర ప్రభుత్వం

Advertisement
Update:2025-01-23 13:37 IST

తెలంగాణలో భారీ పెట్టుబడులకు అమెజాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో ఒప్పందం చేసుకున్నది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌తో పుంకేతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు.రూ. 60 వేల వేల కోట్ల పెట్టుబడులకు అమెజాన్‌ అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఈ సంస్థ డేటా సెంటర్లను విస్తరించనున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అమెజాన్‌కు భూములు కేటాయించనున్నది.సీఎంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు ఈ భేటీలో పాల్గొన్నారు.

మరోవైపు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ. 750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడుతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17 వేల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

Tags:    
Advertisement

Similar News