ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఐటీ దాడులపై అనిల్‌ రావిపూడి ఏమన్నారంటే?

రెండేళ్లు, మూడేళ్లకు ఒకసారి ఇండస్ట్రీ, బిజినెస్‌ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం అన్న డైరెక్టర్‌

Advertisement
Update:2025-01-23 13:49 IST

ఇండస్ట్రీలోని ప్రముఖులపై జరుగుతున్న ఐటీ సోదాలపై డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్పందించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన దీని గురించి మాట్లాడారు. మీ నిర్మాత దిల్‌ రాజు ఐటీ రైడ్స్‌ బాధతో ఉంటే మీరు సక్సెస్‌ మీట్‌ చేసుకుంటున్నారని ఓ జర్నలిస్ట్‌ సరదాగా వేసిన ప్రశ్నకు అనిల్‌ సమాధానం ఇచ్చారు.

'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్‌ పెట్టాం కదా.. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్‌ అయ్యారేమో. దిల్‌రాజు బాధలో లేరు. ఆయన ఒక్కడిపైనే రైడ్స్‌ జరగడం లేదు. ఇండస్ట్రీలోని చాలామందిపై ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ప్రాసెస్‌లో భాగమే. ప్రతి రెండేళ్లు, మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ, బిజినెస్‌ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం. నేను వచ్చినా రాకపోయినా.. ఈ సినిమా ప్రమోషన్‌ను ఆపొద్దు. ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి అని దిల్‌రాజు మాతో చెప్పారు. అందుకే ఈ సినిమా విజయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం అని చెప్పారు.

డైరెక్టర్‌ సుకుమార్‌ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉన్నదా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నేను సుకుమార్‌ ఇంటి పక్కన లేను. ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కకు షిఫ్ట్‌ అవుతాను. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి.. మా ఇంటికి కూడా వస్తారేమో అని సరదాగా చెప్పారు.

Tags:    
Advertisement

Similar News