ప్రపంచకప్ లో శ్రీలంక కీలక విజయం

అప్ఘనిస్థాన్ పై 34 పరుగుల గెలుపు వర్షం దోబూచులాటలో విజేతగా శ్రీలంక వన్డే ప్రపంచకప్ మాజీ చాంపియన్ శ్రీలంక..2019 ఐసీసీ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో కీలక విజయం సాధించింది. కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ వేదికగా ముగిసిన రెండోరౌండ్ పోటీలో…డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా అప్ఘనిస్థాన్ ను 34 పరుగుల తేడాతో ఓడించింది. వర్షం దెబ్బతో 50 ఓవర్ల ఈ మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించి నిర్వహించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు […]

Advertisement
Update:2019-06-05 06:44 IST
  • అప్ఘనిస్థాన్ పై 34 పరుగుల గెలుపు
  • వర్షం దోబూచులాటలో విజేతగా శ్రీలంక

వన్డే ప్రపంచకప్ మాజీ చాంపియన్ శ్రీలంక..2019 ఐసీసీ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో కీలక విజయం సాధించింది. కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ వేదికగా ముగిసిన రెండోరౌండ్ పోటీలో…డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా అప్ఘనిస్థాన్ ను 34 పరుగుల తేడాతో ఓడించింది.

వర్షం దెబ్బతో 50 ఓవర్ల ఈ మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించి నిర్వహించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక..36.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ కుశాల్ పెరెరా 78 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

శ్రీలంక పేస్ కు అప్ఘన్ స్మాష్…

సమాధానంగా ..మ్యాచ్ నెగ్గాలంటే 41 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేయాల్సిన అప్ఘనిస్థాన్…32.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది.

శ్రీలంక పేసర్లు మలింగ 3 వికెట్లు, నువాన్ ప్రదీప్ 4 వికెట్లు పడగొట్టారు.

శ్రీలంక విజయంలో ప్రధాన పాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో.. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక…రెండో రౌండ్ విజయంతో తేరుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News