మారుతి కార్ల ధరలు పెంపు
మోడల్ బట్టి ధరలు పెంచుతున్నట్టు ప్రకటన.. ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు
Advertisement
మారుతి సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈమేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. కార్ల ధర పెంపు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మోడల్ బట్టి కార్ల ధర పెంపు ఉంటుందని పేర్కొన్నది. కార్ల తయారీకి చేస్తున్న వ్యయం పెరగడంతోనే కార్ల ధరలు పెంచుతున్నామని ప్రకటించింది. సెలెరియో ధర రూ.32 వేలు, ఇన్విక్టో ధర రూ.30 వేలు, వ్యాగర్ ఆర్ ధర రూ.15 వేలు, స్విఫ్ట్ ధర రూ.5 వేలు, బ్రెజ్జా ధర రూ.20 వేలు, విటారా ధర రూ.25 వేలు, ఆల్టో కే10 ధర రూ.20 వేలు, ఎస్‌ప్రెస్సో ధర రూ.5 వేలు, బాలెనో ధర రూ.9 వేల వరకు , ఫ్రాంక్స్ ధర రూ.10 వేల వరకు పెంచుతున్నట్టుగా వెల్లడించింది.
Advertisement