కవిత ఓటమికి వాళ్ళే కారణం

లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించిందన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. బీజేపీకి కార్యకర్తలు లేని చోట కూడా ఓట్లు పడ్డాయని, ఇవి ఆశ్చర్యమైన లోక్‌సభ ఎన్నికలన్నారు కేటీఆర్‌. మల్కాజ్‌గిరిలో వెంట్రుకవాసితో కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. రేవంత్‌ రెడ్డిది అసలు ఒక గెలుపే కాదన్నారు‌. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ కూడా ఊహించలేదన్నారు‌. మెడీ హవాతోనే బీజేపీకి ఓట్లు పడ్డాయన్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు 4 లక్షల ఓట్లు తగ్గాయన్నారు. ఈ ఫలితాలు మాకు […]

Advertisement
Update:2019-05-28 11:24 IST

లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించిందన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. బీజేపీకి కార్యకర్తలు లేని చోట కూడా ఓట్లు పడ్డాయని, ఇవి ఆశ్చర్యమైన లోక్‌సభ ఎన్నికలన్నారు కేటీఆర్‌. మల్కాజ్‌గిరిలో వెంట్రుకవాసితో కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. రేవంత్‌ రెడ్డిది అసలు ఒక గెలుపే కాదన్నారు‌.

ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ కూడా ఊహించలేదన్నారు‌. మెడీ హవాతోనే బీజేపీకి ఓట్లు పడ్డాయన్నారు ఆయన.

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు 4 లక్షల ఓట్లు తగ్గాయన్నారు. ఈ ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్‌ బ్రేకర్‌ లాంటివని, ఈ ఓటమి ఓ రకంగా ఫెడరల్‌ స్ఫూర్తికి మంచిదేనన్నారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోతైన సమీక్ష చేస్తామన్నారు కేటీఆర్‌. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తాను ఫెయిల్‌ కాలేదన్నారు‌.

అయితే దేశంలో కాంగ్రెస్‌ దారుణమైన పరిస్థితిలో ఉందన్నారు కేటీఆర్‌. కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది ప్రాంతీయ పార్టీలేనన్నారు. రాష్ట్ర సమస్యల విషయంలో రాజీపడేది లేదని… కేంద్రంతో అంశాలవారీగా సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు.

నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి పై కూడా స్పందించారు కేటీఆర్‌.

నిజామాబాద్‌లో నామినేషన్‌ వేసింది రైతులు కాదని…. రాజకీయ కార్యకర్తలన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్‌ నాయకుడి ఇంట్లో 93 మంది నామినేషన్లు తయారయ్యాయన్నారు కేటీఆర్‌. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడానికి కారణం…. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అవ్వడం వల్లేనన్నారు‌. కవిత డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ అని గుర్తు పెట్టుకోవాలన్నారు కేటీఆర్‌.

తాను కానీ… కవిత కానీ… అనేక డక్కామొక్కీలు తిన్నామని… ఒక్క ఓటమితో కుంగిపోమన్నారు కేటీఆర్‌.

అభ్యర్ధుల ఎంపిక సరిగా లేదనేది అవాస్తమని, ఈ ఎన్నికల్లో గెలుపోటములకు రకరకాల కారణాలున్నాయన్నారు. గతంలో విజయాలు సాధించినప్పుడు ఎవరూ కిరీటాలు పెట్టలేదని…. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఈ ఓటమికే కుంగిపోవాల్సిన పనిలేదన్నారు.

చంద్రబాబు ఓడిపోతాడని తాము ముందే చెప్పామన్నారు కేటీఆర్‌. ఇక తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మంచి సంబంధాలు కొనసాగిస్తాయన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండటం వల్లే జగన్‌ గెలిచారన్నారు కేటీఆర్‌.

Tags:    
Advertisement

Similar News