సర్వే చేయలేదని ఆయనే చెబుతాడు.... సర్వే ఫలితాలూ ఆయనే చెబుతాడు
ఆంధ్ర ఆక్టోపస్ అని మొన్నటి వరకు పేరు. అలాంటి బిరుదు ఆయనకు ఇచ్చింది ఎల్లోమీడియా. ఇంతవరకూ ఎన్ని ఎన్నికల్లో ఆయన చెప్పిన జ్యోస్యం నిజం అయిందో ఎవరూ చెప్పరు. కానీ ఆయన చెప్పాడంటే జరిగి తీరాలంతే…. అన్నంత బిల్డప్ ఇస్తారు. నిజానికి ఆయన జ్యోస్యం చెప్పిన వాటిలో ఫెయిల్ అయినవే ఎక్కువ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బొక్కబోర్లా పడ్డాడు. ఆ తరువాత తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆయన ఫేట్‌ను మార్చేశాయి. మహాకూటమికి […]
ఆంధ్ర ఆక్టోపస్ అని మొన్నటి వరకు పేరు. అలాంటి బిరుదు ఆయనకు ఇచ్చింది ఎల్లోమీడియా. ఇంతవరకూ ఎన్ని ఎన్నికల్లో ఆయన చెప్పిన జ్యోస్యం నిజం అయిందో ఎవరూ చెప్పరు. కానీ ఆయన చెప్పాడంటే జరిగి తీరాలంతే…. అన్నంత బిల్డప్ ఇస్తారు. నిజానికి ఆయన జ్యోస్యం చెప్పిన వాటిలో ఫెయిల్ అయినవే ఎక్కువ.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బొక్కబోర్లా పడ్డాడు. ఆ తరువాత తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆయన ఫేట్‌ను మార్చేశాయి. మహాకూటమికి అనుకూలంగా లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వే ఫలితాలు తారుమారు అయ్యాయి. దీంతో ఆయన కూటమికి మేలు చేసేందుకు నాటకం ఆడారని తెలిసిపోయింది. మైండ్‌గేమ్‌తో ఫలితాలు తారుమారు చేద్దామని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడు ఏపీలో కూడా లగడపాటితో చంద్రబాబు అండ్ బ్యాచ్ మైండ్‌గేమ్ ఆడుతోంది. విలువైన ఒక్క సర్వే కూడా టీడీపీకి అనుకూలంగా ఇవ్వలేదు. కానీ లగడపాటి మాత్రం సెంచరీ సీట్లు అని చెప్పుకొచ్చారు. ప్లస్ ఆర్ మైనస్ అంటూ పలుకులు పలికారు. అయితే ఇక్కడే లగడపాటి సర్వేపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.
ఇక సర్వే విషయానికి వస్తే… అన్ని నియోజకవర్గాలలోనూ సర్వే చేయలేదని ఆయనే చెప్పాడు. 175 నియోజకవర్గాలకు గానూ 38 నియోజకవర్గాల్లో మాత్రమే సర్వే చేశారట. 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి 175 నియోజకవర్గాల ఫలితాలు ఎలా చెప్పాడో ఆయనకే తెలియాలి. మూడు జిల్లాల్లో సర్వేచేసి 13 జిల్లాల ఫలితాలను ఎలా వెల్లడిస్తాడో ఆయనకే తెలియాలి.
శాంపిల్ సైజు తక్కువ. కేవలం 38 నియోజకవర్గాల్లో మాత్రమే సర్వే చేశారు. వాటిని 175 సీట్లకు ఆపాదించారు. ఈవిషయాన్ని ఆర్జీ ప్లాష్ టీమ్ పేరిట తిరుగుతున్న నోట్‌లోనే కనిపిస్తోంది. రాండమ్‌గా 38 సీట్లను ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 12వందల శాంపిల్స్ సేకరించారు. మొత్తం 50 వేల శాంపిల్స్‌తో ఈ సర్వే రిపోర్టు తయారుచేశారు. అంటే ఈ సర్వే విశ్వసనీయత ఏంటో ఈ శాంపిల్స్ లెక్క బట్టి తెలిసిపోతోంది.
మరోవైపు రాయలసీమ జిల్లాలో ఈ సర్వే చేయలేదు. కేవలం మూడు జిల్లాలలో మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. సీమ జిల్లాలను పక్కన పెట్టి చేసిన ఈ సర్వే ఫలితాలు ఎలా నమ్మాలి? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
మొత్తానికి ఈ సర్వే ఫలితాలు వెనుక రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిల్ పోల్ ఫలితాల్లో అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇస్తాయి. దీంతో మైండ్‌గేమ్ ఆడేందుకు మనకు సర్వే కావాలి అని లగడపాటితో ఈ చిలుక జోస్యం చెప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు లగడపాటి కూడా శాంపిల్ సైజ్,38 నియోజకవర్గాల శాంపిల్స్ సైజ్ అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని సమాచారం.