రాజకీయాలకు వద్దన్నారు జనం.... మళ్ళీ సినిమాలకు వెళతాడా?
ఎన్నో ఆశలు.. ప్రజారాజ్యంలా కాకూడదని పకడ్బందీ ప్రణాళికలు…. ఏపీలో కింగ్ మేకర్ అవుదామనుకున్న పవన్ కళ్యాణ్ ఆశలు తీరేలా కనిపించడం లేదు. కర్ణాటకలో కుమారస్వామి వలే ఏపీలో కనీసం 25 సీట్లతో సీఎం అవుదామని కలలుగన్న పవన్ కళ్యాన్ కు ఎగ్జిట్ పోల్స్ తీవ్ర నిరాశను మిగిల్చాయి. 1 నుంచి 3 స్థానాల్లోపే జనసేనకు వస్తాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. విశేషం ఏంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల…. గాజువాక, భీమవరంలో పోటీచేస్తున్నారు. జనసేన […]
ఎన్నో ఆశలు.. ప్రజారాజ్యంలా కాకూడదని పకడ్బందీ ప్రణాళికలు…. ఏపీలో కింగ్ మేకర్ అవుదామనుకున్న పవన్ కళ్యాణ్ ఆశలు తీరేలా కనిపించడం లేదు. కర్ణాటకలో కుమారస్వామి వలే ఏపీలో కనీసం 25 సీట్లతో సీఎం అవుదామని కలలుగన్న పవన్ కళ్యాన్ కు ఎగ్జిట్ పోల్స్ తీవ్ర నిరాశను మిగిల్చాయి. 1 నుంచి 3 స్థానాల్లోపే జనసేనకు వస్తాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.
విశేషం ఏంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల…. గాజువాక, భీమవరంలో పోటీచేస్తున్నారు. జనసేన పార్టీ ఏపీ మొత్తం పోటీచేసినా ఒక్కసీటు మాత్రమే గెలుస్తుందనడంతో పవన్ కళ్యాణ్ సైతం ఒక సీటులో ఓడిపోతాడని అర్థమవుతోంది.
ఏపీలో ఈసారి మూడు సర్వేలు టీడీపీ అని…. జాతీయ చానెళ్లలో మెజార్టీ సంస్థలు 7 వైసీపీ గెలుస్తుంది అని అన్నాయి. లగడపాటి రాజగోపాల్ మాత్రం ఏపీలో టీడీపీదే విజయం అన్నారు. అయితే పై సర్వేసంస్థలు జనసేనకు 1 నుంచి 5 సీట్లలోపే వస్తాయని చెప్పడంతో పవన్ ఆశలు అడియాశలయ్యాయి.
గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన ఈసారి ఆ రెండు పార్టీలతో విభేదించి ఒంటరిగా పోటీచేసింది. కనీసం 25 అసెంబ్లీ సీట్లు, 5 లోక్ సభ సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చుతుందని నమ్మకం పెట్టుకుంది. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకే పూర్తి మెజార్టీ వస్తుందని చెప్పడంతో జనసేన ఆశలు ఆవిరయ్యాయి.
చంద్రబాబు-పవన్ కలిసే కుట్ర పన్నారని వైసీపీ ఆరోపించినట్టే జనసేనను జనాలు పక్కనపెట్టేశారు.
ఇప్పుడు పవన్ కు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆయన ఏం చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. మరి అచ్చిరాని రాజకీయాల్లోనే ఉంటారా? లేక మళ్లీ సినిమాల బాట పడతారా? అన్నది వేచిచూడాలి.