మే 23 ఎవరికి శుభోదయం...!
మే 23. ఏపీ ప్రజలు ఎవరికి శుభోదయం చెబుతారో తేల్చే రోజు. ఆ రోజు కోసం రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఉరకలు వేస్తున్నాయి. తమ భవిష్యత్తును తేల్చి చెప్పే ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. సహజంగానే వైఎస్ఆర్ సీపీలో కొత్త ఆనందం తాండవిస్తుండగా, టీడీపీలో మాత్రం దిగులు ఆవహించుకుంది. అధికారం కొనసాగుతుందా? లేక గద్దె నుంచి అనివార్యంగా దిగిపోవాల్సి వస్తుందో తెలియక వారంతా కలవరపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తన మనసులో ఏముందో […]
మే 23. ఏపీ ప్రజలు ఎవరికి శుభోదయం చెబుతారో తేల్చే రోజు. ఆ రోజు కోసం రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఉరకలు వేస్తున్నాయి. తమ భవిష్యత్తును తేల్చి చెప్పే ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.
సహజంగానే వైఎస్ఆర్ సీపీలో కొత్త ఆనందం తాండవిస్తుండగా, టీడీపీలో మాత్రం దిగులు ఆవహించుకుంది. అధికారం కొనసాగుతుందా? లేక గద్దె నుంచి అనివార్యంగా దిగిపోవాల్సి వస్తుందో తెలియక వారంతా కలవరపడుతున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు తన మనసులో ఏముందో బయటకు చెప్పకపోయినా, విజయావకాశాల మీద ఆయనకు ఆశ చావడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.
మరోవైపు తాను ఎంతగానో నమ్ముకున్న కొందరు తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ముఖం చాటేయడం కూడా ఆయనకు మింగుడు పడడం లేదని అంటున్నారు. చాలా జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉందని అందుతున్న నివేదికలు బాబుకు నిద్ర లేని రాత్రులనే మిగులుస్తున్నాయట.
లోక్ సభకు కనీసం గౌరవప్రదమైన స్థానాలను కూడా సాధించుకోలేకపోతే ఢిల్లీలో తన ప్రతిష్ట కూడా నిలవదని మదనపడుతున్నారట. అయినా గుండెను దిటవు చేసుకుని ఆయన ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని అంటున్నారు. కనీసం ఢిల్లీలో అయినా తాను కోరుకున్న సర్కారు కొలువుదీరితే, భవిష్యత్ లో కేసుల గొడవలలాంటివి ఏమీ ఉండవని ఆశ పడుతున్నారట. అందుకే బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి బాబు తెగ తాపత్రయ పడిపోతున్నారని చెబుతున్నారు.
రెండు కాళ్ల మీద పడవలు పెట్టి ప్రయాణించడం తెలుగుదేశం పార్టీ అధినేతకు కొత్త విషయం కాదు కాబట్టి ఫలితాల తరువాత ఆయన కొత్త సమీకరణాల వైపు అడుగులు వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.
చంద్రబాబు ఇంతగా కలవరపడడం గతంలో ఏనాడూ చూడలేదని పార్టీ సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారట. ఇది ఇలా ఉంటే అటు వైఎస్ఆర్ సీపీ శ్రేణులు మాత్రం గెలుపు మీద కొండంత ధీమాతో ఉన్నాయి. పరిస్థితులు, పరిణామాలు
తమకు అనుకూలంగా మారుతుండడం వారికి పట్టలేని ఆనందాన్ని కలిగిస్తోంది. తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తీరుతారని వారు గట్టిగానే విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 23 ఎవరికి శుభోదయం కానుంది అనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.