హైదరాబాద్‌లో విప్రో కొత్త సెంటర్
విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు
Advertisement
తెలంగాణ సీఎం దావోస్ పర్యటన కొనసాగుతున్నది. దీనిలో భాగంగా విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోపనపల్లిలో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని విప్రో తెలిపింది. మూడేళ్లలో దీన్ని పూర్తి చేస్తామన్నది. ఇందులో 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించ నున్నట్లు చెప్పారు.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం బృందం పర్యటన నేటితో ముగియనున్నది. మధ్యాహ్నం 2.35 గంటలకు సీఎం బృందం జ్యూరిచ్ నుంచి దుబాయ్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా శుక్రవారం ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
Advertisement