తన టీవీ9 ట్రేడ్‌మార్క్‌ను... తనకే అమ్ముకున్న రవిప్రకాష్‌

టీవీ9లో 8 శాతం భాగస్వామి అయినప్పటికీ ఆ కంపెనీ సీఈఓ గా టీవీ9 మొత్తం వ్యవహారాలను రవిప్రకాష్‌ చూసుకున్నాడు. టీవీ9 ఎవరిదీ అంటే రవిప్రకాష్‌ది…. అని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకునేంతగా పాపులర్‌ అయ్యాడు. 91 శాతం భాగస్వామి శ్రీనిరాజు గురించి తెలిసినవాళ్ళు అతి కొద్ది మంది. అలా టీవీ9 పై పెత్తనం చేసిన రవిప్రకాష్‌ బినామీ పేర్లతో మోజో టీవీని ప్రారంభించాడు. ఏ కంపెనీకైనా ట్రేడ్‌ మార్క్‌ లోగోనే ప్రాణం. టీవీ9 ను సుమారు 500 […]

Advertisement
Update:2019-05-17 05:44 IST

టీవీ9లో 8 శాతం భాగస్వామి అయినప్పటికీ ఆ కంపెనీ సీఈఓ గా టీవీ9 మొత్తం వ్యవహారాలను రవిప్రకాష్‌ చూసుకున్నాడు. టీవీ9 ఎవరిదీ అంటే రవిప్రకాష్‌ది…. అని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకునేంతగా పాపులర్‌ అయ్యాడు. 91 శాతం భాగస్వామి శ్రీనిరాజు గురించి తెలిసినవాళ్ళు అతి కొద్ది మంది.

అలా టీవీ9 పై పెత్తనం చేసిన రవిప్రకాష్‌ బినామీ పేర్లతో మోజో టీవీని ప్రారంభించాడు.

ఏ కంపెనీకైనా ట్రేడ్‌ మార్క్‌ లోగోనే ప్రాణం. టీవీ9 ను సుమారు 500 కోట్లకు ఇతరులు కొన్నారంటే ఆ ట్రేడ్‌ మార్క్‌ కోసమే. అలాంటి ట్రేడ్‌ మార్క్‌ లోగోను కంపెనీలో 91 శాతం వాటా ఉన్నవాళ్ళకు చెప్పకుండా రవిప్రకాష్‌ 99 వేలకు అమ్మేశాడు. ఎవరికి అమ్మేశాడూ అంటే…. బినామీ పేరుతో తనకే….

ఈ విషయంలో బంజారాహిల్స్‌ పీఎస్‌లో టీవీ9 డైరెక్టర్‌ కౌశిక్‌రావు…. టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌, మాజీ డైరెక్టర్‌ మూర్తిపై ఫిర్యాదు చేశారు. 99 వేలకే టీవీ9 ట్రేడ్‌మార్క్‌, కాపీ రైట్‌లను మీడియా నెక్ట్స్‌ కంపెనీకి బదలాయించినట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్ళిద్దరిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

తప్పుడు డాక్యుమెంట్లతో టీవీ9కు చెందిన కాపీరైట్స్‌, ట్రేడ్‌మార్క్‌లను మీడియా నెక్ట్స్‌ ఇండియా కంపెనీకి బదలాయించేందుకు రవిప్రకాష్‌, మూర్తి కుట్ర పన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు కౌశిక్‌ రావు. దాంతో పోలీసులు వీళ్ళిద్దరిపై ఐపీసీ 467, 420, 409, 406, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో రవిప్రకాష్‌కు 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు మరో నోటీసు ఇవ్వనున్నారు. ఇప్పటికే రవిప్రకాష్‌ కోసం సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News