ఐపీఎల్ నాలుగో టైటిల్ తో ముంబై ఇండియన్స్ ఖుషీ

ముంబై నగరంలో విజయోత్సవాలు గాల్లో తేలిపోతున్న నీతా అంబానీ అండ్ కో… సౌత్ ముంబైలో విక్టరీ పరేడ్ ఐపీఎల్ చరిత్రలోనే నాలుగు టైటిల్స్ సాధించిన తొలిజట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించడంతో ఆజట్టు అభిమానులు మాత్రమే కాదు.. ఫ్రాంచైజీ ఓనర్లు నీతా అంబానీ, ఆమె ఇద్దరు తనయులు, జట్టు సభ్యులు గాల్లో తేలిపోతున్నారు. పట్టలేని ఆనందంతో విజయోత్సవాలు జరుపుకొన్నారు. హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో ఆదివారం రాత్రి ముగిసిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై మాజీ చాంపియన్ ముంబై […]

Advertisement
Update:2019-05-14 02:55 IST
  • ముంబై నగరంలో విజయోత్సవాలు
  • గాల్లో తేలిపోతున్న నీతా అంబానీ అండ్ కో…
  • సౌత్ ముంబైలో విక్టరీ పరేడ్

ఐపీఎల్ చరిత్రలోనే నాలుగు టైటిల్స్ సాధించిన తొలిజట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించడంతో ఆజట్టు అభిమానులు మాత్రమే కాదు.. ఫ్రాంచైజీ ఓనర్లు నీతా అంబానీ, ఆమె ఇద్దరు తనయులు, జట్టు సభ్యులు గాల్లో తేలిపోతున్నారు. పట్టలేని ఆనందంతో విజయోత్సవాలు జరుపుకొన్నారు.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో ఆదివారం రాత్రి ముగిసిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ 1 పరుగు విజయం సాధించడంతో ఆ జట్టు సభ్యుల ఆనందానికి అంతేలేదు.

ఆధిక్యత చేతులు మారుతూ …ఓ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన ఈ లోస్కోరింగ్ ఫైనల్లో తమ విజయం అనూహ్యమంటూ నీతా మురిసిపోతున్నారు.

ఆఖరి ఓవర్లో ఆరు బంతుల వరకూ తాను కళ్లు మూసుకొని దేవుడ్ని ప్రార్థిస్తూ గడిపానని నీతా గుర్తు చేసుకొన్నారు.
విజయోత్సవాలు… ముంబై జట్టు సభ్యులు హైదరాబాద్ నుంచి ముంబై నగరానికి సోమవారం సాయంత్రం చేరుకొన్న సమయంలో విమానాశ్రయం వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు.

జట్టు సభ్యులందరూ ఓపెన్ టాప్ బస్సులో దక్షిణ ముంబైలోని అంబానీల అధికార నివాసం ఆంటిలా వద్దకు ఊరేగింపుగా వచ్చారు. దారిపొడవునా జట్టు సభ్యులు ట్రోఫీ ఊపూతూ.. కేరింతలు కొడుతూ అభివాదం చేశారు.

ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, యువరాజ్ సింగ్, లాసిత్ మలింగ, కృణాల్ పాండ్యా, టీమ్ కోచ్ మహేల జయవర్ధనేలు ట్రోఫీ పట్టుకొని తమ ఆనందాన్ని చాటుకొన్నారు.

ట్రోఫీనే అతిపెద్ద అవార్డు…

తమజట్టుకు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లాంటి అవార్డులు రాకపోయినా…విజేతగా నిలవడమే అతిపెద్ద అవార్డని ముంబై కోచ్ మహేల జయవర్థనే చెప్పాడు.

అయితే…ఐపీఎల్ అత్యుత్తమ క్యాచ్ అవార్డు ముంబై ఆటగాడు కిరాన్ పోలార్డ్, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డును ముంబై ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అందుకోడం విశేషం.

Tags:    
Advertisement

Similar News