లోటస్‌పాండ్ టు అమరావతి.... వైసీపీ ఆఫీస్ షిఫ్ట్ !
ఎన్నికల ఫలితాలు రాలేదు. ఇంకా తొమ్మిది రోజుల టైముంది. కానీ జగన్ దూకుడు పెంచారు. ఒక వైపు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించబోతున్నారు. మరోవైపు పార్టీ ఆఫీసును లోటస్‌పాండ్ నుంచి పూర్తిగా అమరావతికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఫర్నీచర్ ఫ్యాక్ చేశారు. అమరావతికి తరలించారు. మిగిలింది అక్కడ పూర్థి స్థాయిలో ఆఫీసులో కార్యకలాపాలు ప్రారంభించడమే మిగిలింది. ఆఫీసును అమరావతికి తరలించడంతో పాటు ఇతర కార్యకలాపాలు స్పీడ్ పెంచడంతో…. ఎన్నికల ఫలితాలపై జగన్ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ […]
ఎన్నికల ఫలితాలు రాలేదు. ఇంకా తొమ్మిది రోజుల టైముంది. కానీ జగన్ దూకుడు పెంచారు. ఒక వైపు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించబోతున్నారు. మరోవైపు పార్టీ ఆఫీసును లోటస్‌పాండ్ నుంచి పూర్తిగా అమరావతికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఫర్నీచర్ ఫ్యాక్ చేశారు. అమరావతికి తరలించారు. మిగిలింది అక్కడ పూర్థి స్థాయిలో ఆఫీసులో కార్యకలాపాలు ప్రారంభించడమే మిగిలింది.
ఆఫీసును అమరావతికి తరలించడంతో పాటు ఇతర కార్యకలాపాలు స్పీడ్ పెంచడంతో…. ఎన్నికల ఫలితాలపై జగన్ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ధీమాతోనే ఆయన అన్ని పనులు చేస్తున్నట్లు సమాచారం. 16 నుంచి పార్టీ కార్యక్రమాలు వరుసగా నిర్వహించబోతున్నారు.
తొలుత కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ నేతలకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 21లోగా పార్టీ కీలకనేతలు విజయవాడలో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. 22న ఉండవల్లిలో నివాసానికి జగన్ రానున్నారు. మే 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో అక్కడి నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలు సమీక్షిస్తారు.
మొత్తానికి జగన్ స్పీడ్ పెంచడంతో టీడీపీ నేతల్లో మరింత కలవరం మొదలైంది. వైసీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంటే.. టీడీపీ నేతలలో రోజురోజుకూ కాన్ఫిడెన్స్ తగ్గుతోంది. తమకు అధికారం వచ్చేది కల్లే అన్న మాటలు వారిలో విన్పిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు టీడీపీ నేతలు రావడం లేదు. ఎవరో ఒకరు వచ్చినా చంద్రబాబు లాగే చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి వెళుతున్నారు.