మే23న.... ఈ విజయమే తాతకు నివాళి

మే 23న వైఎస్ జగన్ జీవితంలో మరిచిపోలేని రెండు ఘటనలు జరగనున్నాయి. ఒకటి తను పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఈసారి అధికారమే లక్ష్యంగా పోరాడారు. మే 23న ఫలితాలతో జగన్ కల నెరవేరే అంచనాలున్నాయి. ఎందుకంటే ఈసారి ఏపీలో గెలుపు వైసీపీదేనని మెజార్టీ సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు మే 23 వైఎస్ కుటుంబంలో విషాదం నింపిన రోజు. మే 23నే వైఎస్ జగన్ తాత రాజారెడ్డి దారుణ హత్యకు గురైన రోజు. మే 23న ఫలితంలో విజయం సాధించి […]

Advertisement
Update:2019-05-12 07:47 IST

మే 23న వైఎస్ జగన్ జీవితంలో మరిచిపోలేని రెండు ఘటనలు జరగనున్నాయి. ఒకటి తను పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఈసారి అధికారమే లక్ష్యంగా పోరాడారు. మే 23న ఫలితాలతో జగన్ కల నెరవేరే అంచనాలున్నాయి. ఎందుకంటే ఈసారి ఏపీలో గెలుపు వైసీపీదేనని మెజార్టీ సర్వేలు పేర్కొంటున్నాయి.

దీంతోపాటు మే 23 వైఎస్ కుటుంబంలో విషాదం నింపిన రోజు. మే 23నే వైఎస్ జగన్ తాత రాజారెడ్డి దారుణ హత్యకు గురైన రోజు. మే 23న ఫలితంలో విజయం సాధించి ఇడుపులపాయలో తాత రాజారెడ్డికి నివాళులర్పించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం.

వైఎస్ రాజారెడ్డి 1998 మే 23వ తేదీన హత్యకు గురయ్యారు. టీడీపీ నాయకుడు పార్థసారథి రెడ్డి, ఆయన సోదరుడు ఉమామహేశ్వర్ రెడ్డి లు అనుచరులతో కలిసి రాజారెడ్డిపై బాంబు దాడులు చేసి వేటకోడవళ్లతో నరికి చంపారు. కడప జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఉన్న రాజారెడ్డి మరణించినప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది.

రాజారెడ్డి నిందితులను కాపాడేందుకు చంద్రబాబు వారికి ఆశ్రయం కల్పించారన్న విమర్శలు అప్పుడు వచ్చాయి. కానీ తండ్రి మరణించినా…. కడప అట్టుడుకుతున్నా పీసీసీ చీఫ్ గా, ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన అచరులను, అభిమానులను శాంతింప చేసి శాంతిస్థాపనకు కృషి చేశారు.

రాజారెడ్డి మరణించి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడూ ఏపీలో చంద్రబాబే అధికారంలో ఉండడం విశేషం. ఇప్పుడు మే23న వచ్చే ఫలితాలతో చంద్రబాబును అధికారంలోంచి దించడంతోపాటు వైఎస్ రాజారెడ్డికి ఘనంగా నివాళులర్పించాలని జగన్ యోచిస్తున్నారు. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండడంతో మే 23 జగన్ కు మరుపురాని రోజుగా మిగిలిపోయే అవకాశం ఉందని వైసీపీ అభిమానులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News