కిడారి రాజీనామా విషయంలో కూడా రాజకీయం చేస్తున్న చంద్రబాబు

కిడారి శ్రవణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సామాన్య వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లోపు చట్ట సభకు ఎంపిక కావాలని రాజ్యాంగం చెబుతోంది. దీంతో గవర్నర్ నర్సింహన్ కిడారి రాజీనామాకు ఆదేశించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. రేపటితో కిడారి శ్రవణ్ గడువు తీరిపోతుంది. కొత్త ప్రభుత్వం ఎవరనేది మే 23 తర్వాత తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రస్తుతం ఉన్న కేబినెట్ మొత్తం […]

Advertisement
Update:2019-05-09 05:31 IST

కిడారి శ్రవణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సామాన్య వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లోపు చట్ట సభకు ఎంపిక కావాలని రాజ్యాంగం చెబుతోంది. దీంతో గవర్నర్ నర్సింహన్ కిడారి రాజీనామాకు ఆదేశించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.

రేపటితో కిడారి శ్రవణ్ గడువు తీరిపోతుంది. కొత్త ప్రభుత్వం ఎవరనేది మే 23 తర్వాత తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రస్తుతం ఉన్న కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సిందే. ఒక వేళ టీడీపీ ప్రభుత్వం వచ్చినా రాజ్యాంగ పరంగా ముందు క్యాబినెట్ రద్దవుతుంది. ఆ తర్వాతే తిరిగి కొత్త మంత్రులు వస్తారు. అంటే కేవలం 13 రోజుల ముందు కిడారి శ్రవణ్ రాజీనామా చేయాల్సి వస్తోంది. అరకు నుంచి పోటీ చేసిన కిడారి గెలిచినా.. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చి.. చంద్రబాబు తిరిగి మంత్రి పదవి ఇస్తేనే ఆయన మంత్రి అవుతాడు. ఒక వేళ వైసీపీ గెలిస్తే అందరూ రాజీనామాలు చేయల్సిందే.

కేవలం 13 రోజుల ముందు… అది కూడా రాజ్యాంగం ప్రకారమే అనర్హుడు అవుతున్నందుకు శ్రవణ్ రాజీనామా చేయాల్సి వచ్చినా దీనిపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. అడ్వొకేట్ జనరల్‌ వద్దకు ఈ విషయాన్ని పంపి న్యాయ సలహా కోరారు. శ్రవణ్ ఎమ్మెల్యే కాకముందే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అలాంటప్పుడు ఆరు నెలల గడువు ముగిసింది కనుక రాజీనామా చేయాలా? ఫలితాలు వచ్చేదాకా ఆగొచ్చా? అనే అంశాన్ని పరిశీలించాలని ఏజీకి సూచించారు.

ప్రస్తుతం బెంగాల్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాతే రాజీనామా విషయంపై నిర్ణయం తీసుకుంటారట. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన సీనియర్ నేత ఒక రాజీనామా విషయంలో ఇంత తాత్సరం చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News