కేసీఆర్, జగన్‌ లను లాగే ప్రయత్నంలో కాంగ్రెస్ ?

కాంగ్రెస్ పార్టీ తమ పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. ఈ దేశాన్ని ఎన్నో ఏండ్లు పరిపాలించిన ఆ జాతీయ పార్టీ నేడు కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ పార్టీల వైపు చూస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏ పార్టీలతో అయితే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా తలపడిందో.. ఇప్పుడు అవే పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దక్షిణాదిన బలమైన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, వైసీపీని తమతో పాటు కలిసి నడవటానికి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ […]

Advertisement
Update:2019-05-08 04:58 IST

కాంగ్రెస్ పార్టీ తమ పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. ఈ దేశాన్ని ఎన్నో ఏండ్లు పరిపాలించిన ఆ జాతీయ పార్టీ నేడు కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ పార్టీల వైపు చూస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏ పార్టీలతో అయితే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా తలపడిందో.. ఇప్పుడు అవే పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

దక్షిణాదిన బలమైన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, వైసీపీని తమతో పాటు కలిసి నడవటానికి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ మద్దతు కోసం లేఖల మీద లేఖలు రాస్తోంది.

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర కూడా కేసీఆర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ మాత్రం ఏ ఒక్క లేఖకు కూడా స్పందించడం లేదు. పైగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలు తిరుగుతున్నారు.

మరోవైపు వైఎస్ జగన్‌ను కూడా యూపీఏలోనికి తీసుకొని రావడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకు తక్కువ స్థానాలే వస్తాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో యూపీఏ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

జగన్, కేసీఆర్‌లను తమవైపు తిప్పుకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కేసీఆర్ యూపీఏలోకి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఎన్నికల తర్వాత రాజకీయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News