టీఆర్ఎస్‌పై వివేక్ ఇలా ప‌గ తీర్చుకుంటున్నారా?

పెద్ద‌ప‌ల్లి ఎంపీ టికెట్ నిరాక‌రించ‌డంతో వీ6 వివేక్ వెంక‌ట‌స్వామి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పద‌వికి రాజీనామా చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. త‌న గ్రూపు కార్య‌క‌ర్త‌ల‌ను కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిందిగా కోరారు. అన్న‌ట్లుగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ప‌నిచేశారు. ఇటు త‌న పేప‌ర్ వెలుగు, టీవీ చాన‌ల్ వీ6లో ఇప్పుడు టీఆర్ఎస్ వ్య‌తిరేక క‌థ‌నాల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌ల‌పై ఫోక‌స్ పెడుతున్నారు. స్వ‌యంగా వివేక్ కోదండ‌రాంతో పాటు […]

Advertisement
Update:2019-05-07 04:25 IST

పెద్ద‌ప‌ల్లి ఎంపీ టికెట్ నిరాక‌రించ‌డంతో వీ6 వివేక్ వెంక‌ట‌స్వామి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పద‌వికి రాజీనామా చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. త‌న గ్రూపు కార్య‌క‌ర్త‌ల‌ను కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిందిగా కోరారు. అన్న‌ట్లుగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ప‌నిచేశారు.

ఇటు త‌న పేప‌ర్ వెలుగు, టీవీ చాన‌ల్ వీ6లో ఇప్పుడు టీఆర్ఎస్ వ్య‌తిరేక క‌థ‌నాల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌ల‌పై ఫోక‌స్ పెడుతున్నారు. స్వ‌యంగా వివేక్ కోదండ‌రాంతో పాటు ప‌లువురు నేత‌ల ఇంట‌ర్వ్యూలు చేస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను పెంచే కార్య‌క్ర‌మం చేస్తున్నారు.

మ‌రోవైపు ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ వివేక్ త‌న స‌త్తా చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి వాద నాయ‌కుల‌ను ఆయ‌న ద‌గ్గ‌ర‌కు తీస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌ వ‌ర్గ ప‌రిధిలో త‌న‌కు ప‌ట్టున్న గ్రామాలు, మండ‌లాల్లో త‌న వ‌ర్గం నేత‌ల‌ను నిల‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ ఓట్ల‌ను చీల్చేందుకు కొంద‌రు నేత‌లకు వివేక్ మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని లోక‌ల్‌గా టాక్‌. అలిండియా ఫార్వ‌డ్ బ్లాక్ పార్టీ త‌ర‌పున బీఫామ్‌లు ఇచ్చి మ‌రీ ఈయ‌న నిలబెట్టార‌ని టీఆర్ఎస్ నేత‌ల వాద‌న‌.

లోకల్ ఎల‌క్ష‌న్స్ లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా వివేక్ ఈ ప‌నికి దిగిన‌ట్లు స‌మాచారం. అలిండియా ఫార్వార్డ్ బ్లాక్ త‌ర‌పున త‌న మ‌ద్ద‌తు దారుల‌ను ఆయ‌న నిల‌బెట్టార‌ని అంటున్నారు. ఎక్క‌డెక్క‌డ టీఆర్ఎస్ ఓట్లకు గండిపెడితే కాంగ్రెస్‌కు మైలేజీ వ‌స్తుందో….అక్క‌డ ఆ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి వివేక్ రాజ‌కీయం పెద్ద‌ప‌ల్లిలో కాంగ్రెస్‌కి క‌లిసి వ‌స్తుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News