ఏపీ పోలింగ్ కేంద్రాలపై 'స్పై' శాటిలైట్ల నిఘా..?

భారత దేశ ఎన్నికల చరిత్రలో తొలి సారిగా స్పై(నిఘా) శాటిలైట్లు వాడుతున్నారు. సాధారణంగా దేశ రక్షణ కోసం వాడే ఈ శాటిలైట్లను తొలి విడతలో ఏపీ వైపున నిఘా పెట్ట బోతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. వీటిలో 9000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మకమైనవి దాదాపు 2500 వరకు ఉన్నాయి. ఈ అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు రాయలసీమ, కృష్ణా జిల్లా, విశాఖ […]

Advertisement
Update:2019-04-10 13:38 IST

భారత దేశ ఎన్నికల చరిత్రలో తొలి సారిగా స్పై(నిఘా) శాటిలైట్లు వాడుతున్నారు. సాధారణంగా దేశ రక్షణ కోసం వాడే ఈ శాటిలైట్లను తొలి విడతలో ఏపీ వైపున నిఘా పెట్ట బోతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. వీటిలో 9000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మకమైనవి దాదాపు 2500 వరకు ఉన్నాయి.

ఈ అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు రాయలసీమ, కృష్ణా జిల్లా, విశాఖ మన్యంలో ఉన్నాయి. ఈసీ విజ్ఞప్తి మేరకు వీటిపై ఇస్రోకి చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ల ద్వారా నిఘా ఉంచబోతున్నారు. ఎక్కడైనా ఘర్షణలు, దాడులు జరుగుతున్నట్లు తెలియగానే డ్రోన్ల ద్వారా మరో సారి విషయాన్ని తెలుసుకొని.. భద్రతా బలగాలను 10 నిమిషాల్లో అక్కడికి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇది నిజమేనని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే దేశ చరిత్రలో స్పై శాటిలైట్లను ఉపయోగించి జరుపబోతున్న ఎన్నికలు ఇవే అవుతాయి.

Tags:    
Advertisement

Similar News