ఐపీఎల్ -12 డాట్ బాల్ కింగ్ దీపక్ చాహర్
చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ సరికొత్త రికార్డు రషీద్ ఖాన్, అనికేత్ రాజ్ పుట్ ల రికార్డు తెరమరుగు 20 డాట్ బాల్స్ తో 20 పరుగులకు 3 వికెట్ల దీపక్ ఐపీఎల్ 12వ సీజన్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లోనే సరికొత్త రికార్డు నమోదయ్యింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన ఆరో రౌండ్ మ్యాచ్ లో… చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బౌలర్ దీపక్ చాహర్ ఈ ఘనత […]
- చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ సరికొత్త రికార్డు
- రషీద్ ఖాన్, అనికేత్ రాజ్ పుట్ ల రికార్డు తెరమరుగు
- 20 డాట్ బాల్స్ తో 20 పరుగులకు 3 వికెట్ల దీపక్
ఐపీఎల్ 12వ సీజన్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లోనే సరికొత్త రికార్డు నమోదయ్యింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన ఆరో రౌండ్ మ్యాచ్ లో… చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బౌలర్ దీపక్ చాహర్ ఈ ఘనత సాధించాడు.
24 బాల్స్ లో 20 డాట్లు….
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో…ఒక్కో బౌలర్ కు నాలుగు ఓవర్లు…అంటే కేవలం 24 బాల్స్ మాత్రమే బౌల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నాలుగు ఓవర్లలోనే 70కి పైగా పరుగులు ఇచ్చిన బౌలర్లు సైతం లేకపోలేదు. అయితే…పరుగులు లేని బాల్ ను…డాట్ బాల్ గా పరిగణిస్తారు. వికెట్ల తీయాలంటే…ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పై ఒత్తిడి తేవాలంటే డాట్ బాల్సే కీలకం.
ఐపీఎల్ గత 11 సీజన్లలో చరిత్రలో …ఓ ఇన్నింగ్స్ లో అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేసిన రికార్డు…హైదరాబాద్ సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, అనికేత్ రాజ్ పుట్ ల పేరుతో ఉంది.
ఆ రికార్డును ప్రస్తుత 12వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బౌలర్ కమ్ పేస్ బౌలర్ దీపక్ చాహర్ తెరమరుగు చేశాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్ లో దీపక్ చాహర్ తన కోటా మొత్తం 24 బాల్స్ లో 20 డాట్ బాల్స్ వేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
20 బాల్స్ లో ఒక్క పరుగు ఇవ్వకపోయినా…మిగిలిన నాలుగు బాల్స్ లోనే 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఆట 19వ ఓవర్లలో….కోల్ కతా సూపర్ హిట్టర్ యాండ్రీ రసెల్ కు…దీపక్ చాహర్ ఏకంగా ఐదు డాట్ బాల్స్ వేసి వావ్ అనిపించుకొన్నాడు. మొత్తం మీద 20 డాట్ బాల్స్ తో దీపక్ చాహర్ తనపేరుతో ఓ ఐపీఎల్ రికార్డును నమోదు చేయగలిగాడు.