టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు

వరుసగా మూడేళ్ల ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో టీమిండియా విరాట్ సేనకు గదతో పాటు 10 లక్షల డాలర్ల నజరానా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో… ఐసీసీ ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత… మూడేళ్ల పాటు ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆసియా తొలిజట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 1తో ముగిసిన టెస్ట్ ర్యాంకింగ్స్ మదింపు లో… విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియానే అగ్రస్థానంలో నిలిచింది. 116 పాయింట్లతో టీమిండియా టాప్ ర్యాంకర్ గా నిలిస్తే…108 […]

Advertisement
Update:2019-04-03 02:56 IST
  • వరుసగా మూడేళ్ల ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో టీమిండియా
  • విరాట్ సేనకు గదతో పాటు 10 లక్షల డాలర్ల నజరానా

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో… ఐసీసీ ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత… మూడేళ్ల పాటు ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆసియా తొలిజట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

ఏప్రిల్ 1తో ముగిసిన టెస్ట్ ర్యాంకింగ్స్ మదింపు లో… విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియానే అగ్రస్థానంలో నిలిచింది.

116 పాయింట్లతో టీమిండియా టాప్ ర్యాంకర్ గా నిలిస్తే…108 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో ర్యాంక్ సంపాదించింది. 105 పాయింట్లతో సౌతాఫ్రికా మూడు, 104 పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగు ర్యాంకులు సాధించాయి.

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ సాధించిన జట్టుకు 10 లక్షల డాలర్ల బోనస్ తో పాటు ఓ గదను సైతం ఐసీసీ అందచేస్తూ వస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 10 లక్షల డాలర్ల చెక్ తో పాటు గదను సైతం అందుకొన్నాడు.

రెండో ర్యాంకులో నిలిచిన న్యూజిలాండ్ 5 లక్షల డాలర్ల నజరానా సొంతం చేసుకొంది. సౌతాఫ్రికా 2 లక్షల డాలర్లు, ఆస్ట్రేలియా లక్షల డాలర్ల బోనస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2012లో జరిగే టెస్ట్ చాంపియన్షిప్ టోర్నీలో… టెస్ట్ హోదా పొందిన మొత్తం తొమ్మిది అగ్రశ్రేణిజట్లు… 27 సిరీస్ ల్లో భాగంగా 71 టెస్ట్ మ్యాచ్ ల్లో పోటీపడాల్సి ఉంది. అత్యధిక సిరీస్ లు, విజయాలు సాధించిన జట్టుకే టాప్ ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News