చర్చనీయాంశమైన పవన్ కల్యాణ్ విద్వేష ప్రసంగాలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ విధ్వంసకర ప్రసంగాలు చేస్తున్నారు. మొన్నటి వరకు చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు పవన్ కల్యాణ్ వినిపిస్తున్నారు. ఏపీ ఎన్నికలతో సంబంధం లేని అంశమైన తెలంగాణ సెంటిమెంట్‌ను పవన్ కల్యాణ్ తీసుకొస్తున్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని కొడుతున్నారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చారు. అలా చేయడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ విధ్వంసకర ప్రసంగాలు చేస్తున్నారు.
మొన్నటి వరకు చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు పవన్ కల్యాణ్ వినిపిస్తున్నారు. ఏపీ ఎన్నికలతో సంబంధం లేని అంశమైన తెలంగాణ సెంటిమెంట్‌ను పవన్ కల్యాణ్ తీసుకొస్తున్నారు.
తెలంగాణలో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని కొడుతున్నారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చారు. అలా చేయడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.
కేసీఆర్ వస్తే చూసిచూడనట్టు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఆంధ్రా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అంటూ సవాల్ విసిరాడు.
నామినేషన్ సందర్భంగా విశాఖలోనూ పవన్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని కించపరుస్తూ రాయలసీమ రౌడీలు, రాయలసీమ మూకలు అంటూ పవన్ కల్యాణ్ విధ్వేషపూరిత ప్రసంగం చేశారు.
కులాలను కలుపుతా… ప్రాంతాలను ఏకం చేస్తానని చెప్పే పవన్ కల్యాణ్… ఇలా హఠాత్తుగా తీరా ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విధ్వేషం సృష్టించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది చర్చనీయాంశమైంది.
ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.