ఏపీ ఎన్నికల్లో సినీ గ్లామర్
వైసీపికి సీనీవరద, రాజకీయ రంగ స్థలంలోకి నటులే నటులు సినీ గ్లామర్‌తో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు రెండోసారి బరిలోకి దిగిన నందమూరి బాలయ్య, రోజా జనసేనలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన పవన్ కల్యాణ్ గ్లామర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నిలకు గతంలో ఎన్నడూ లేనంతగా సినీ గ్లామర్ తోడయ్యింది. బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన నటులు….వివిధ పార్టీల తరపున ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టడానికి తహతహలాడుతున్నారు. యాక్షన్‌కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి…… రాజకీయ రంగ స్థలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఏపీ రాజకీయం […]
- వైసీపికి సీనీవరద, రాజకీయ రంగ స్థలంలోకి నటులే నటులు
- సినీ గ్లామర్‌తో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు
- రెండోసారి బరిలోకి దిగిన నందమూరి బాలయ్య, రోజా
- జనసేనలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన పవన్ కల్యాణ్ గ్లామర్
ఆంధ్రప్రదేశ్ ఎన్నిలకు గతంలో ఎన్నడూ లేనంతగా సినీ గ్లామర్ తోడయ్యింది. బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన నటులు….వివిధ పార్టీల తరపున ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టడానికి తహతహలాడుతున్నారు. యాక్షన్‌కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి…… రాజకీయ రంగ స్థలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఏపీ రాజకీయం సినిమా రంగు పులుముకుంటోంది. మేకప్ వేసుకుని ఎన్నికల్లో తమ నటనా కౌశలాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కొందరు లొకేషన్ చూసుకుని..ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామో? అవకాశమనే టికెట్ ఇచ్చే డెరెక్టర్ ఎవరో.. ఖర్చు భరించే నిర్మాత ఎక్కడున్నారో వెదుక్కుని మరీ రంగ ప్రవేశం చేస్తుంటే.. మరికొందరు తమ అభిమాన పార్టీల అధినేతలకు ఉడతా భక్తి సాయం చేసేందుకు పార్టీ కండువాలు కప్పుకొని ఎన్నికల రంగస్థలం ఎక్కారు.
మూడు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారానికి సాగిస్తున్నారు. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ నువ్వా నేనా అన్నట్లు ప్రచారాన్ని సాగిస్తున్నారు. పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీల్లో సినీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
రెండోసారి బరిలో బాలకృష్ణ, రోజా
ఎన్టీఆర్ కుమారుడు,సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నా..ఆయన తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు వల్లభనేని వంశీ, మాగంటి బాబు ఎన్నికల బరిలో ఉన్నారు.
టీడీపీలో దివ్యవ్యాణి, వాణి విశ్వనాథ్..
అలనాటి అందాల తారలు దివ్యవాణి, వాణి విశ్వనాథ్‌లు పసుపురంగు పులుముకున్నారు. ఇక తెర వెనుక ప్రచార పటాలు, టీవీ ప్రకటనలు రూపకల్పన బాధ్యతలను దర్శకులు బోయపాటి శ్రీనివాస్, మరికొందరు దర్శకులు భుజానికెత్తుకున్నట్టు సమాచారం.
వైసీపీలోకి సినీ వరద…
వైసీపీ నుంచి చిత్తూరు జిల్లా నగరి స్థానం నుంచి సినీ నటి రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హాస్య నటుడు పృథ్వీరాజ్, రచయిత పోసాని కృష్ణమురళి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇటీవలే సీనియర్ నటి జయసుధ, హాస్యనటుడు అలీ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, పాతతరం సినీ హీరో భానుచందర్, వర్ధమాన నటులు కృష్ణుడు పార్టీలో చేరారు. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ సైతం విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగారు.
జనసేనకు పవర్ స్టార్…..
ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి జనసేన పార్టీని స్థాపించి రంగంలోకి దిగారు. పార్టీ అధినేత కాగా..ఆయన సోదరుడు నాగబాబు వపన్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు జబర్దస్త్ ఫేమ్ ఆది ఆ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటుండగా..షకలక శంకర్ తదితరులు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. మరీ ఏ పార్టీకి ఏ గ్లామర్ కలిసివస్తుందో తెలియాంటే మరి కొన్ని రోజులు వేచిచూడాలి. సినీగ్లామర్ కు ఓటర్లు ఏమేరకు రాలతాయన్నదే ఇక్కడి అసలు పాయింట్.