ఎండలు... బాబోయ్‌ ఎండలు !

ఎండలు మండనున్నాయ్…  ఎండలు ఠారేత్తించనున్నాయ్… ఎండలు వణికించనున్నాయ్… రానున్న మూడు, నాలుగు నెలలు తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. గడచిన రెండు, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతంగా ఎండలు మండనున్నాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలలలో ఉష్టోగ్రతలు 47 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఎన్నాడూ లేనంతగా వడగాల్పులు తెలుగు రాష్ట్రాలని గజగజ లాడించనున్నాయని అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 39 […]

Advertisement
Update:2019-03-01 16:18 IST

ఎండలు మండనున్నాయ్… ఎండలు ఠారేత్తించనున్నాయ్… ఎండలు వణికించనున్నాయ్… రానున్న మూడు, నాలుగు నెలలు తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు.

గడచిన రెండు, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతంగా ఎండలు మండనున్నాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలలలో ఉష్టోగ్రతలు 47 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఎన్నాడూ లేనంతగా వడగాల్పులు తెలుగు రాష్ట్రాలని గజగజ లాడించనున్నాయని అంటున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 39 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇది ఫిబ్రవరి నెలలో సాధారణ ఉష్టోగ్రత కంటే మూడు డిగ్రీలు ఎక్కువని చెబుతున్నారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లలో ఈ వేసవిలో 49 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉష్టోగ్రతలు నమోదు అవుతాయని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో కూడా అత్యధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు. చెట్లు కొట్టివేత, అడవుల నరికివేత వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాలలో నానాటికి పెరుగుతున్న వాహన కాలుష‌్యం కూడా వాతావరణ మార్పులకు కారణమవుతోందని, అందువల్లే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వాతావరణంలో సమూల మార్పులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News