చంద్రబాబు, పవన్ ల మధ్య పూర్తయిన సీట్ల సర్దుబాటు....
మరో సంచలనం విషయం. ఒక ప్రముఖ పత్రిక చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి కలిసిపోయారన్న అంశంపై బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తయిందని ఆ పత్రిక వివరించింది. 25 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు పవన్ కల్యాణ్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు పత్రిక వెల్లడించింది. ఈసారి కూడా పవన్, చంద్రబాబు భేటీకి చంద్రబాబు కరకట్ట భవన నిర్మాత లింగమనేని రమేషే మధ్యవర్తిత్వం వహించారని వివరించింది. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానితో పాటు.. ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న విషయం […]
మరో సంచలనం విషయం. ఒక ప్రముఖ పత్రిక చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి కలిసిపోయారన్న అంశంపై బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తయిందని ఆ పత్రిక వివరించింది. 25 ఎమ్మెల్యే, 3 ఎంపీ
సీట్లు పవన్ కల్యాణ్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు పత్రిక వెల్లడించింది. ఈసారి కూడా పవన్, చంద్రబాబు భేటీకి చంద్రబాబు కరకట్ట భవన నిర్మాత లింగమనేని రమేషే మధ్యవర్తిత్వం వహించారని వివరించింది.
ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానితో పాటు.. ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న విషయం పైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోతుగా చర్చించారు. అయితే నిన్నటి వరకు తిట్టుకుని ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ప్రజలను ఎలా ఒప్పించాలన్న దానిపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు కథనం. టీఆర్‌ఎస్, బీజేపీ, కేంద్రం అన్యాయం వంటి అంశాల ఆధారంగా పొత్తును ఖరారు చేసుకునే యోచనలో ఇద్దరు నేతలున్నారు.
కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు పోరాటం చేస్తున్నారని… తమది కూడా కేంద్రంపై పోరాటం చేయాలన్న విధానమేనని కాబట్టి కలిసి పోరాటం చేస్తే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పే ఆలోచనలో ఇద్దరు
నేతలు ఉన్నారు. లేకుంటే టీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దాన్ని అడ్డుకుని ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకే టీడీపీ, జనసేన కలిశాయని చెప్పే అంశంపైనా చర్చించినట్టు కథనం.