వంగవీటి రాధాకు నో టికెట్‌....

వైసీపీని వీడిన వంగవీటి రాధా టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. వైసీపీని రాధా వీడగానే టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లి ఆయన్ను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలోనూ చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడారు రాధా. అప్పటి వరకు తన తండ్రి రంగాను చంపించింది చంద్రబాబే అని చెబుతూ వచ్చిన రాధా…. అందంతా తూచ్ అనేశారు. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. అయితే రాధా టీడీపీలో చేరినా ఈసారి ఎమ్మెల్యే టికెట్ దక్కే చాన్స్ లేదు. విజయవాడ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను […]

Advertisement
Update:2019-02-21 03:21 IST

వైసీపీని వీడిన వంగవీటి రాధా టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. వైసీపీని రాధా వీడగానే టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లి ఆయన్ను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలోనూ చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడారు రాధా.

అప్పటి వరకు తన తండ్రి రంగాను చంపించింది చంద్రబాబే అని చెబుతూ వచ్చిన రాధా…. అందంతా తూచ్ అనేశారు. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు.

అయితే రాధా టీడీపీలో చేరినా ఈసారి ఎమ్మెల్యే టికెట్ దక్కే చాన్స్ లేదు. విజయవాడ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ పత్రికలే వెల్లడించాయి. విజయవాడ తూర్పు నుంచి
గద్దె రామ్మోహన్‌, సెంట్రల్ నుంచి బొండా ఉమా, పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌ పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ పత్రిక వెల్లడించింది.

వీటితో పాటు నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, మైలవరం నుంచి దేవినేని ఉమా, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్‌, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ నుంచి బుద్ద ప్రసాద్‌, గన్నవరం నుంచి వల్లభనేని వంశీల పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్టు టీడీపీ మీడియా వివరించింది.

దీంతో వంగవీటి రాధా టీడీపీలో చేరినా ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం లేదు. ఎమ్మెల్సీ గానీ, మరేదైనా నామినేటెడ్‌ పదవితో గానీ సరిపెట్టుకుంటారేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News