బ్రాండ్ అంబాసిడర్‌గా జూ. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్‌ను మరో ప్రముఖ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. యాపీ ఫిజ్‌ డ్రింక్‌కు దక్షిణభారత బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తారని తయారీ సంస్థ పార్లే ఆగ్రో తెలిపింది. ఈ వేసవిలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో పార్లే ఆగ్రో సంస్థకు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా… ఇటీవలే కర్నాటకలోని మైసూరులో కొత్తగా ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మూడు ప్లాంట్ల సామర్థ్యానికి తగ్గట్టుగా యాపీ ఫిజ్ అమ్మకాలు […]

Advertisement
Update:2019-02-21 02:02 IST

జూనియర్ ఎన్టీఆర్‌ను మరో ప్రముఖ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. యాపీ ఫిజ్‌ డ్రింక్‌కు దక్షిణభారత బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తారని తయారీ సంస్థ పార్లే ఆగ్రో తెలిపింది.

ఈ వేసవిలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో పార్లే ఆగ్రో సంస్థకు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా… ఇటీవలే కర్నాటకలోని మైసూరులో కొత్తగా ప్లాంట్‌ను ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో మూడు ప్లాంట్ల సామర్థ్యానికి తగ్గట్టుగా యాపీ ఫిజ్ అమ్మకాలు పెంచుకునేందుకు సంస్థ నిర్ణయించుకుంది. దక్షిణ భారతదేశంలో సేల్స్ పెంచుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారకర్తగా ఉపకరిస్తారని కంపెనీ భావిస్తోంది. యాపీ ఫిజ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండడం తనకు ఆనందంగా ఉందని జూ. ఎన్టీఆర్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News