"దేశం" నుంచి వలసలు.... బాబు గుండె గుబేలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయం మహారంజుగా మారింది. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు వలసలాంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ వలసల కారణంగా ఖంగు తింటున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిపోతోంది. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ వలసలు గుండె గుభేలు అనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి “వస్తా బాబు” అని టాటా చెప్పి వెళ్లిపోతారో అని కంగారు పడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా […]

Advertisement
Update:2019-02-21 07:29 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయం మహారంజుగా మారింది. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు వలసలాంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ వలసల కారణంగా ఖంగు తింటున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిపోతోంది. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ వలసలు గుండె గుభేలు అనిపిస్తున్నాయి.

ఎప్పుడు ఏ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి “వస్తా బాబు” అని టాటా చెప్పి వెళ్లిపోతారో అని కంగారు పడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం వలసల దిగులు ఆయన్ని వెంటాడుతోంది. బయటికి వెళ్లిపోయిన నాయకులందరూ చంద్రబాబు పైన, పార్టీలో ఆయన వందిమాగాదులపైన నిప్పులు చెరుగుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ వెళ్లిపోతున్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్, అమలాపురం లోక్‌సభ సభ్యుడు రవీంద్రబాబు, చీరాల శాసనసభ్యుడు ఆమంచి క్రిష్ణమోహన్ టీడీపీలో కుల పిచ్చి పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి వెళ్లిపోయారు.

వీరిక ముందే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. గతంలో అనేక మంది అనేక పార్టీలు మారారు, అయితే ఎవ్వరూ కూడా ఆ పార్టీల అధ్యక్షులను టార్గెట్ చేసి విమర్శించలేదు. దీనికి కారణం భవిష్యత్తులో తిరిగి అదే పార్టీలో చేరుతామేమో అనే అనుమానం ఉండేది. అయితే ఈ సారి మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులందరూ భవిష్యత్తులో తామూ చంద్రబాబు వైపు చూసేది లేదు అనే ధోరణిలోనే విమర్శలు సంధించారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్ ఏకంగా చంద్రబాబు నాయుడి స్వకుల ప్రేమను బహిరంగంగానే ఎండగట్టారు. గతంలో ఎన్నాడు ఇంత తీవ్ర విమర్శ ఎదుర్కోని చంద్రబాబు నాయుడి మైండ్ బ్లాంక్‌ అయ్యిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడి పాలనలో ఆయన సామాజిక వర్గమే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడలేదని, ఆయన చుట్టూ ఉన్న ఉన్నతాధికారులందరు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారేనని లెక్కలతో సహా వివరిస్తూ బాంబు పేల్చారు. ఇది చంద్రబాబు నాయుడి గుండెను నేరుగా తాకింది.

ఇక అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అయితే రాష్ట్రనికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని తూటా పేల్చారు. మరో ఎంపీ రవీంద్రబాబు చంద్రబాబు వల్ల ప్రత్యేక ప్యాకేజీ రాదు, ప్రత్యేక హోదా కూడా రాదు. ఆయన వల్ల ఏపీ ప్రజలకు నష్టమే తప్పా వీసవంత లాభముండదు అంటూ మండిపడ్డారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ మారుతూ మారుతూ చంద్రబాబు నాయుడు గుక్క తిప్పుకోకుండా తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    
Advertisement

Similar News