ఏపీలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు

అధికారుల కమిటీతో సీఎం చంద్రబాబు సమావేశం

Advertisement
Update:2024-12-30 18:46 IST

ఆంధ్రప్రదేశ్‌ లో మహిళలకు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఉచిత బస్సు సౌకర్యంపై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీతో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్‌ లో సమావేశమయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్న కర్నాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో తాము అధ్యయనం చేస్తున్నామని, వీలైనంత త్వరగా నివేదిక అందజేస్తామన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కసరత్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి రాం ప్రసాద్‌ రెడ్డి, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News