వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పని కష్టాలు

భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలి సెమీ-హైస్పీడ్ రైలు ”వందే భారత్ ఎక్స్‌ప్రెస్”. గత వారంలో తొలి కమర్షియల్ రన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే ఈ రైలుకు మాత్రం రోజూ ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది. ఇవాళ వందే భారత్ ఎక్స్‌ప్రైస్‌ పైకి కొందరు రాళ్లతో దాడి చేశారు. రైలు తుండ్లా జంక్షన్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్లు కిటికీలకు తాకడంతో అద్దాలు పగిలిపోయాయి. ఈ నెలలో వందే […]

Advertisement
Update:2019-02-20 11:59 IST

భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలి సెమీ-హైస్పీడ్ రైలు ”వందే భారత్ ఎక్స్‌ప్రెస్”. గత వారంలో తొలి కమర్షియల్ రన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే ఈ రైలుకు మాత్రం రోజూ ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది.

ఇవాళ వందే భారత్ ఎక్స్‌ప్రైస్‌ పైకి కొందరు రాళ్లతో దాడి చేశారు. రైలు తుండ్లా జంక్షన్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్లు కిటికీలకు తాకడంతో అద్దాలు పగిలిపోయాయి. ఈ నెలలో వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరగడం ఇది మూడో సారి.

రైలు కమర్షియల్ ప్రారంభానికి ముందు ట్రయిల్ రన్‌లో ఉన్నప్పుడు డిసెంబర్‌లో ఢిల్లీ-ఆగ్రా మధ్య రాళ్ల దాడి జరిగింది. అప్పుడు అధికారులు దర్యాప్తు చేయగా వాళ్లలో చాలా మంది పిల్లలే ఉండటంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

ఇక గత వారం కమర్షియల్ పరుగు ప్రారంభించిన రెండో రోజే వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో పశువులకు ఢీకొని మార్గ మధ్యంలోనే ఆగిపోయింది. ఇలా వరుస సంఘటనలు వందే భారత్ ప్రయాణికులకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News