ఒక కుల ఆధిపత్యాన్ని తట్టుకోలేక పోయాను
టీడీపీలో నీచమైన కులతత్వం పెరిగింది…. దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే బతికి ఉన్నా వృథానే….. అని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సమాజం గురించి మాట్లాడే వారికి చంద్రబాబు వద్ద స్థానం లేదన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిశారు. తాను టీడీపీ తరపున గెలవలేదని ఇండిపెండెంట్‌గా గెలిచానని గుర్తు చేశారు. కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను జనసేనలో చేరుతానని ఎన్నడూ చెప్పలేదన్నారు. వైసీపీలో చేరికకు తాను ఎలాంటి షరతులు […]
టీడీపీలో నీచమైన కులతత్వం పెరిగింది…. దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే బతికి ఉన్నా వృథానే….. అని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.
సమాజం గురించి మాట్లాడే వారికి చంద్రబాబు వద్ద స్థానం లేదన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిశారు. తాను టీడీపీ తరపున గెలవలేదని ఇండిపెండెంట్‌గా గెలిచానని గుర్తు చేశారు. కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
తాను జనసేనలో చేరుతానని ఎన్నడూ చెప్పలేదన్నారు. వైసీపీలో చేరికకు తాను ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు. రాజకీయంగా న్యాయబద్దమైన అంశాలపై తాము చర్చించామన్నారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన చెప్పే వరకు బాగానే అనిపించిందని… కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు.
పార్టీలో పనిచేశాను కాబట్టి చంద్రబాబు పిలిచినప్పుడు వెళ్లి కలిశానన్నారు. కానీ టీడీపీలో పరిస్థితులు చూసిన తర్వాత అక్కడ కొనసాగడం సరికాదన్న నిర్ధారణకు తాను, తన అనుచరులం వచ్చామన్నారు. ముఖ్యమంత్రి నివాసంలో గానీ, సీఎంవోలో గానీ అంతా ప్రభుత్వానికి, సమాజానికి సంబంధం లేని వారే చక్రం తిప్పుతున్నారన్నారు. సమాజం గురించి, ప్రజల గురించి మాట్లాడే వారికి అక్కడ చోటు లేకుండా పోయిందన్నారు.
టీడీపీ అద్బుతంగా ఉందని చెప్పుకుంటున్నారని… కానీ అది నిజమో కాదో త్వరలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. చీరాలలో కరణం బలరాం పోటీ చేసినా తనకేం ఇబ్బంది లేదన్నారు. తాను వైసీపీ నుంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమంచి చెప్పారు. తాను పార్టీ మారేందుకు తన నియోజకవర్గం సమస్యలే కారణం కాదని… ప్రభుత్వం నిత్యం చెబుతున్న
అబద్దాలను చూసి భరించలేకే బయటకు వచ్చానన్నారు.
32 నెలల నుంచి డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు పసుపు- కుంకుమ అంటూ మహిళలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పవిత్రమైన పసుపు- కుంకుమ పేరును కూడా అపవిత్రం చేశారన్నారు. 6వేల కోట్లకు పైగా వడ్డీ బకాయి ఉన్నప్పటికీ దాన్ని చెల్లించకుండా ఓట్ల కోసం పసుపు- కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారన్నారు.
చంద్రబాబును కరకట్ట మీద పెద్దపెద్ద వాళ్లు వచ్చి కలుస్తుంటారని…. కనుసన్నల్లోనే వారు శాసిస్తున్నారని ఆమంచి చెప్పారు. కులతత్వం కూడా పెరిగిపోయిందన్నారు. ఈ నీచమైన కులతత్వాన్ని ప్రశ్నించేందుకే తాను టీడీపీ నుంచి బయటకు వచ్చానన్నారు.
వైఎస్‌ను చాలా దగ్గరగా చూశామని… జగన్ కూడా అలాగే ఉంటారని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రం సమస్యలనుంచి బయటపడాలంటే జగన్ తప్ప మరో దారి లేదన్నారు ఆమంచి కృష్ణమోహన్.
చంద్రబాబు రోజుకో మాట చెప్పి పిచ్చెక్కిస్తుంటారని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల నుంచి, ప్రత్యేక హోదా వరకు అన్నింటిపైనా రోజుకో మాట మార్చడం… దాన్ని బాగా ప్రచారం చేయించుకోవడం అలవాటుగా మారిందన్నారు. తాను ఏంచేసినా, ఏం చెప్పినా చెల్లుతుందనే నీచ ఆలోచనతో పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు పదేపదే మార్చే మాటలను ఎవరైనా వింటే ఆయనకు పిచ్చి పట్టిందేమో అనుకుంటారన్నారు.
చంద్రబాబు ఆయనకు ఆయన వర్గమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ దారుణమైన పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఇక బతికి ఉండడమే వృథా అన్నారు.
తాను ఇండిపెండెంట్‌గా గెలిచి వస్తే అక్కడ తనకు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారంటూ కొన్ని పత్రికలు సృష్టించాయన్నారు. ఒక కులం గుత్తాధిపత్యం కోసం తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నిస్తోందని… దానికి తాను వ్యతిరేకం అని ఆమంచి చెప్పారు.
నేను తీసుకునే ఈ నిర్ణయానికి నా రాజకీయ గురువు రోశయ్య గారి ఆమోదం ఉందని తెలిపారు.