పిల్లల మీద ఒట్టేయిస్తున్నారు....
మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. పసుపు-కుంకుమ చెక్కులు తీసుకునేందుకు వచ్చిన మహిళలతో ప్రమాణం చేయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటేస్తామని ప్రమాణం చేస్తేనే చెక్కులు చేతిలో పెడుతున్నారు. ఈ ప్రమాణాన్ని ఆలయాల్లో చేయిస్తున్నారు. మంత్రి అయ్యన్న భార్య, కుమారులు కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా నేరుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మంత్రి భార్య, కుమారుడు. నాలుగున్నరేళ్ల కాలంలో సంపాదించిన సొమ్ముతో మహిళలకు చీరలు పంచుతున్నారు. యువతకు క్రికెట్ కిట్లు ఇస్తున్నారు. వాటిని తీసుకునే ముందు […]
మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. పసుపు-కుంకుమ చెక్కులు తీసుకునేందుకు వచ్చిన మహిళలతో ప్రమాణం చేయించుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటేస్తామని ప్రమాణం చేస్తేనే చెక్కులు చేతిలో పెడుతున్నారు. ఈ ప్రమాణాన్ని ఆలయాల్లో చేయిస్తున్నారు. మంత్రి అయ్యన్న భార్య, కుమారులు కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా నేరుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మంత్రి భార్య, కుమారుడు.
నాలుగున్నరేళ్ల కాలంలో సంపాదించిన సొమ్ముతో మహిళలకు చీరలు పంచుతున్నారు. యువతకు క్రికెట్ కిట్లు ఇస్తున్నారు. వాటిని తీసుకునే ముందు మాత్రం ప్రమాణం చేయాల్సిందే.
నర్సీపట్నం 26 వార్డులో పర్యటనకు వచ్చిన మంత్రి చింతకాయల చిన్న కుమారుడు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలోనే ప్రమాణాలు చేయించారు. పిల్లలను తీసుకుని వచ్చిన మహిళలతో పిల్లల మీద ప్రమాణం చేయించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని ప్రమాణం చేసిన వారికే చెక్కులు, చీరలు అందించారు.
ఈ విషయం తెలియక అక్కడికి వెళ్లిన మహిళలు ఇబ్బందిపడ్డారు. వెనుదిరుగుదామంటే మంత్రి అనుచరులకు టార్గెట్ అవుతామన్న భయంతో… ఇష్టం లేకపోయినా తమ పిల్లల మీద ప్రమాణం చేసి వచ్చారు.