గులాబీ కోట వైపు రేవంత్ అనుచరుల చూపులు !
కాంగ్రెస్‌లో రేవంత్ బ్యాచ్ ఇమడలేకపోతుందా? గాంధీభవన్ మార్క్ పాలిటిక్స్‌కు అలవాటు పడలేకపోతుందా? హస్తినలో లాబీయింగ్ రాజకీయాలతో సతమతమవుతోందా? అంటే అవుననే మాటలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ బ్యాచ్ కాంగ్రెస్ రాజకీయాల్లో సర్దుకోలేకపోతుందని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు రేవంత్‌తో పాటు టీడీపీలో కీలకమైన ఐదు నుంచి ఆరుగురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు వీరికి ప్రాధాన్యత దక్కేది. మీడియాలో కూడా వీరి హడావుడి కనిపించేది. కానీ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వీరి ఉనికి ఇప్పుడు కనిపించడం […]
కాంగ్రెస్‌లో రేవంత్ బ్యాచ్ ఇమడలేకపోతుందా? గాంధీభవన్ మార్క్ పాలిటిక్స్‌కు అలవాటు పడలేకపోతుందా? హస్తినలో లాబీయింగ్ రాజకీయాలతో సతమతమవుతోందా? అంటే అవుననే మాటలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ బ్యాచ్ కాంగ్రెస్ రాజకీయాల్లో సర్దుకోలేకపోతుందని తెలుస్తోంది.
గత ఎన్నికల ముందు రేవంత్‌తో పాటు టీడీపీలో కీలకమైన ఐదు నుంచి ఆరుగురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు వీరికి ప్రాధాన్యత దక్కేది. మీడియాలో కూడా వీరి హడావుడి కనిపించేది. కానీ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వీరి ఉనికి ఇప్పుడు కనిపించడం లేదు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన అరికెల నర్సిరెడ్డి ఎమ్మెల్యే సీటు ఆశించారు. కానీ అది రాలేదు. కనీసం ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇటు పార్టీ పదవులు రాకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? కొంతకాలం వేచిచూద్దామా? అనే ధోరణిలో ఈయన ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, మానకొండూరు నేత కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర నేతలు అప్పట్లో కాంగ్రెస్‌లో చేరారు.
పాత కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడం వల్లే పెద్దపల్లిలో తాను ఓడిపోయానని విజయరమణారావు ప్రస్టేషన్‌తో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయంను కొట్టబోయేంత పనిచేశారు.
అయితే పెద్దపల్లి డీసీసీ పదవియైనా తనకు వస్తుందని ఆయన ఆశించారు. తీరా ఇప్పుడు తన వ్యతిరేక వర్గానికి చెందిన ఈర్ల కొమురయ్యకు పదవి రావడంతో విజయరమణారావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాజకీయాలు అర్దం కావడం లేదని…ఇక్కడ పనిచేసేవారికి స్థానం లేదని తన అనుచరులతో వాపోయినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇలాగే రాజకీయాలు ఉంటే ప్రత్యామ్నాయం చూసుకోవడం బెటర్ అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు నేతలే కాదు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన రాజారాం యాదవ్ ఎన్నికల ముందే టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి? వాటిని బట్టి ఏం చేయాలి? ఈ నాలుగేళ్లు నెగ్గుకురావడం ఎలా? అనే దానిపై రేవంత్ బ్యాచ్ మల్లగుల్లాలు పడుతోంది. అధికార పార్టీలో అవకాశం ఉంటే కర్చీప్ వేస్తే ఎలా ఉంటుంది అనే విషయాలపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.