అదెలా అవుట్ ఇస్తారు..? " ఎంపైర్లతో వాగ్వాదం
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కివీస్ ఆటగాడు డార్లీ మిచెల్ ఎంపైర్లతో వాగ్వాదానికి దిగారు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అది అవుట్ ఎలా అవుతుందని వాగ్వాదానికి దిగారు. చివరకు థర్డ్ అంపైర్ కూడా అవుట్ అని డిక్లేర్ చేసినా మిచెల్ అంగీకరించలేదు. థర్డ్ ఎంపైర్ రెండోసారి కూడా పరిశీలించి అవుటేనని స్పష్టం చేయడంతో అప్పటికి గానీ మిచెల్ మైదానం వీడేందుకు అంగీకరించలేదు. భారత బౌలర్ కృనాల్ పాండ్యా వేసిన ఆరో […]
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కివీస్ ఆటగాడు డార్లీ మిచెల్ ఎంపైర్లతో వాగ్వాదానికి దిగారు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అది అవుట్ ఎలా అవుతుందని వాగ్వాదానికి దిగారు. చివరకు థర్డ్ అంపైర్ కూడా అవుట్ అని డిక్లేర్ చేసినా మిచెల్ అంగీకరించలేదు. థర్డ్ ఎంపైర్ రెండోసారి కూడా పరిశీలించి అవుటేనని స్పష్టం చేయడంతో అప్పటికి గానీ మిచెల్ మైదానం వీడేందుకు అంగీకరించలేదు.
భారత బౌలర్ కృనాల్ పాండ్యా వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతి మిచెల్ కాలిని నేరుగా తాకింది. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఎంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దాంతో మిచెల్ అది అవుట్ కాదని… ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిందంటూ అప్పీల్ కోరారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మిచెల్‌కు అండగా నిలిచాడు.
Daryl Mitchel got an inside egde? Oh come on! The bat clearly hit the pad. How else would your explain the snicko? #NZvIND @ICC pic.twitter.com/ZgKHLDAmUJ
— Faraz haider (@farazchishti10) February 8, 2019
బంతి తాకిన విధానాన్ని పరిశీలించిన థర్డ్ ఎంపైర్… ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ అవుట్‌గానే ప్రకటించారు. కానీ మిచెల్ మైదానం వీడలేదు.
మరోసారి ఇన్‌సైడ్ ఎడ్జ్‌పై వివరణ కోరాడు. దాంతో మరోసారి పరిశీలించిన థర్డ్ అంపైర్ తాను తొలి నిర్ణయానికే కట్టుబడ్డాడు. దీంతో నసుక్కుంటూనే మిచెల్ మైదానం వీడి వెళ్లాడు. 43 పరుగుల వద్ద మిచెల్ మూడో వికెట్‌గా ఫెవిలియన్ చేరాడు.