బడ్జెట్ లో మరో భారీ పథకం.... కార్మికులకు రూ.3వేల పించన్
అసంఘటిత కార్మికులకు ప్రత్యేక పించన్ పథకాన్ని ప్రకటించింది కేంద్రం. కేంద్ర స్థాయిలో ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. – పశుసంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2శాతం వడ్డీ రాయితీ. – ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పించన్. – అసంఘటిత కార్మికుల పెన్షన్ స్కీంకు రూ. 500 కోట్లు కేటాయింపు. – 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ. 3వేల పెన్షన్ – నెలకు 100 […]
అసంఘటిత కార్మికులకు ప్రత్యేక పించన్ పథకాన్ని ప్రకటించింది కేంద్రం.
కేంద్ర స్థాయిలో ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.
– పశుసంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2శాతం వడ్డీ రాయితీ.
– ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పించన్.
– అసంఘటిత కార్మికుల పెన్షన్ స్కీంకు రూ. 500 కోట్లు కేటాయింపు.
– 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ. 3వేల పెన్షన్
– నెలకు 100 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ. 3వేల పించన్ పథకం.
– అసంఘటిత రంగంలోని 10 కోట్ల మంది కార్మికులకు వర్తించనున్న పథకం
– కార్మికుల ప్రమాద బీమా మొత్తం రూ. 1.5లక్షల నుంచి ఏకంగా రూ. 6లక్షలకు పెంపు.
– అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు.
– ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం.
– ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన పంటల రుణాలు రీషెడ్యూల్.
– రీషెడ్యూల్ చేసిన రుణాలపై 2శాతం వడ్డీ తగ్గింపు.
మొదలైన జనాకర్షక పథకాలను ప్రకటించారు.