ధోనీ ఐడియా రోహిత్ కెరియర్ నే మార్చేసింది....

గత ఆరేళ్లలో 113 మ్యాచ్ ల్లో 5వేల 821 పరుగులు టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ 12 ఏళ్లు …200 వన్డేలు…22 సెంచరీలు 3 డబుల్ సెంచరీలతో సహా 20 శతకాలు ప్రపంచ రికార్డుతో 3 డబుల్ సెంచరీల ఒకే ఒక్కడు ధూమ్ ధామ్ ఓపెనర్ రోహిత్ శర్మకు..వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు బాదడం ఏమాత్రం కొత్త కాదు. అయితే..పన్నెండేళ్ల తన కెరియర్ లో ఓ అసాధారణ ద్విశతకం సాధించాడు. ఐర్లాండ్ గడ్డపై వన్డే అరంగేట్రం చేసిన […]

Advertisement
Update:2019-02-01 03:10 IST
  • గత ఆరేళ్లలో 113 మ్యాచ్ ల్లో 5వేల 821 పరుగులు
  • టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ
  • 12 ఏళ్లు …200 వన్డేలు…22 సెంచరీలు
  • 3 డబుల్ సెంచరీలతో సహా 20 శతకాలు
  • ప్రపంచ రికార్డుతో 3 డబుల్ సెంచరీల ఒకే ఒక్కడు

ధూమ్ ధామ్ ఓపెనర్ రోహిత్ శర్మకు..వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు బాదడం ఏమాత్రం కొత్త కాదు. అయితే..పన్నెండేళ్ల తన కెరియర్ లో ఓ అసాధారణ ద్విశతకం సాధించాడు. ఐర్లాండ్ గడ్డపై వన్డే అరంగేట్రం చేసిన టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ…న్యూజిలాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించాడు.

డాషింగ్ ఓపెనర్ రోహిత్…

రోహిత్ శర్మ…ప్రపంచ క్రికెట్ అభిమానులకు…ముఖ్యంగా శతకోటి భారత అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. తన పేరులోనే …హిట్ పదాన్ని దాచుకొని…వన్డే క్రికెట్లో టీమిండియా.. హిట్ మాన్ గా నిలిచిన రోహిత్ శర్మ..వన్డే క్రికెట్ చరిత్రలోనే ఓ అసాధారణ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ఇంగ్లండ్ వేదికగా మరికొద్ది వారాల్లో జరిగే వన్డే ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనున్న టీమిండియా జట్టుకే ఊపిరిగా మారాడు.

2007లో అరంగేట్రం….

ఐర్లాండ్ ప్రత్యర్థిగా…బెల్ పాస్ట్ వేదికగా 2007 సిరీస్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ…ఆ తర్వాత నుంచి మరి వెనుదిరిగి చూసిందిలేదు. గత పుష్కరకాలంగా టీమిండియా..బ్యాట్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకొన్నాడు.

అంతేకాదు…న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రస్తుత… పాంచ్ పటాకా సిరీస్ లోని నాలుగో వన్డే ద్వారా…రెండు వందల వన్డే మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ల క్లబ్ లో చోటు సంపాదించాడు.

వన్డే మ్యాచ్ ల డబుల్ సెంచరీ సాధించిన 15వ భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు…ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సంపాదించిన 72వ క్రికెటర్ గా నిలిచాడు.

కొహ్లీ తర్వాతి స్థానంలో….

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ భారత క్రికెట్ చరిత్రలో మాత్రమే కాదు…వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 463 వన్డేలతో మాస్టర్ సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

భారత మరో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 334 వన్డేలతో మాస్టర్ తర్వాతి స్థానంలో నిలిస్తే… టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ …222 వన్డేల మైలురాయిని చేరాడు.

పుష్కరకాలం క్రితం వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ..మిడిలార్డర్ ఆటగాడిగా ..2007 నుంచి 2012 వరకూ 86 మ్యాచ్ లు ఆడి అంతంత మాత్రంగానే రాణించాడు. మొత్తం ..86 వన్డేల్లో 2 సెంచరీలతో 1978 పరుగులతో 30. 43 సగటు మాత్రమే నమోదు చేశాడు.

ధోనీ ఐడియా తో రో…హిట్…

అయితే…2013 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో …అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయంతో…. రోహిత్ శర్మ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. రోహిత్ ను మిడిలార్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోట్ చేయాలన్న నిర్ణయం…టీమిండియాకు ఓ అసాధారణ ఓపెనర్ ను అందించింది.

టీమిండియా వన్డే ఓపెనర్ గా రోహిత్ గత ఆరేళ్ల కాలంలో అత్యుత్తమంగా రాణిస్తూ వస్తున్నాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రస్తుత సిరీస్ లోని మూడో వన్డే వరకూ 113 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 5వేల 821 పరుగులు సాధించాడు.

ఇందులో …3 డబుల్ సెంచరీలతో సహా 20 శతకాలున్నాయి. మొత్తం 60.00 సగటుతో తిరుగులేని ఓపెనర్ గా రోహిత్ నిలిచాడు.

డబుల్ బాదుడులో ఒకే ఒక్కడు….

అంతేకాదు…వన్డే క్రికెట్ చరిత్రలోనే…మూడు ద్విశతకాలు బాదిన ఏకైక ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే. 2016 సీజన్ నుంచి.. క్యాలెండర్ ఇయర్ కు ఓ డబుల్ సెంచరీ చొప్పున సాధిస్తూ వచ్చిన క్రికెటర్ కూడా రోహిత్ శర్మ మాత్రమే.

వన్డే క్రికెట్ న్యూజిలాండ్ తో ముగిసిన మూడో వన్డే వరకూ…తన కెరియర్ లో ఆడిన 199 మ్యాచ్ ల్లో…రోహిత్ శర్మ ..ఏకంగా 7 వేల 799 పరుగులు సాధించాడు. 22 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో పాటు… 215 సిక్సర్లతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

కెప్టెన్ గానూ రోహిత్ హిట్…..

వన్డే ల్లో టీమిండియా స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డే ఉంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ విశ్రాంతి తీసుకొన్న ప్రతిసారీ…టీమిండియా స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన రోహిత్…విజయవంతమైన సారథిగా నిలిచాడు.

ఆసియాకప్ టోర్నీ మ్యాచ్ లతో సహా మొత్తం ఎనిమిది వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన రోహిత్ ఏడు విజయాలు అందించాడు. టీమిండియా ఓపెనర్ కమ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ రెండు సెంచరీలతో సహా 106. 8 సగటుతో తనకుతానే సాటిగా నిలిచాడు.

న్యూజిలాండ్ తో ముగిసిన నాలుగో వన్డేలో రోహిత్ విఫలమైనా…ఫిబ్రవరి 3న వెలింగ్టన్ వేదికగా జరిగే ఆఖరి వన్డేలో తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పే అవకాశాలు లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News