ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన స్పీకర్ కోడెల

ఇటీవల ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించారు. రాజీనామా లేఖలు పెండింగ్‌లో ఉండడంతో ఇద్దరు ఎమ్మెల్యేలతో స్పీకర్‌ కోడెల మరోసారి మాట్లాడారు. తాను టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాను కాబట్టి తన రాజీనామా ఆమోదించాలని రావెల కిషోర్ బాబు మరోసారి కోరారు. జనసేనలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని స్పీకర్‌కు వివరించారు. దీంతో వారిద్దరి రాజీనామాలను […]

Advertisement
Update:2019-01-29 15:41 IST

ఇటీవల ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించారు. రాజీనామా లేఖలు పెండింగ్‌లో ఉండడంతో ఇద్దరు ఎమ్మెల్యేలతో స్పీకర్‌ కోడెల మరోసారి మాట్లాడారు.

తాను టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాను కాబట్టి తన రాజీనామా ఆమోదించాలని రావెల కిషోర్ బాబు మరోసారి కోరారు.

జనసేనలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని స్పీకర్‌కు వివరించారు. దీంతో వారిద్దరి రాజీనామాలను వెంటనే స్పీకర్ కోడెల ఆమోదించారు.

అయితే… వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు కూడా గతంలోనే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశామని చెప్పారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఇక స్పీకరేనని గతంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా చెప్పారు.

జనసేనలోకి వెళ్లిన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన నేపథ్యంలో మరి ఫిరాయింపు మంత్రుల రాజీనామా లేఖలు ఎక్కడున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News