సిగ్గుపడుతున్నా- పాక్ కెప్టెన్‌కు క్లాస్ పీకిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్
సౌతాఫ్రికా ఆటగాడిని ”కర్రోడా” అంటూ దూషించడం ద్వారా పాక్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. సర్పరాజ్ వ్యాఖ్యలను పాక్ మాజీ క్రికెటర్లే తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా తీవ్రంగా స్పందించారు. సర్పరాజ్ వ్యాఖ్యలపై ఒక వీడియోను ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దాన్ని అక్తర్ తొలగించాడు. వెంటనే సర్పరాజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అక్తర్ డిమాండ్ చేశాడు. సర్పరాజ్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినప్పుడు చాలా బాధపడ్డానన్నారు. ఒక […]
సౌతాఫ్రికా ఆటగాడిని ”కర్రోడా” అంటూ దూషించడం ద్వారా పాక్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. సర్పరాజ్ వ్యాఖ్యలను పాక్ మాజీ క్రికెటర్లే తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా తీవ్రంగా స్పందించారు. సర్పరాజ్ వ్యాఖ్యలపై ఒక వీడియోను ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దాన్ని అక్తర్ తొలగించాడు.
వెంటనే సర్పరాజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అక్తర్ డిమాండ్ చేశాడు. సర్పరాజ్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినప్పుడు చాలా బాధపడ్డానన్నారు. ఒక పాకిస్తానీయుడిగా సర్పరాజ్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పాడు. సర్పరాజ్ తీరును తాను కూడా అవమానకరంగా భావిస్తున్నట్టు వివరించారు.
ఇలాంటి వ్యవహారశైలిని ఏ ఒక్కరూ సహించడానికి వీల్లేదన్నాడు అక్తర్. ఒక కెప్టెన్‌గా ఉండి మరొకరిని రంగు పేరుతో దూషించడం ఏమిటని ప్రశ్నించాడు. కెప్టెన్‌గా ఉన్న వ్యక్తిని చూసి చాలా మంది స్పూర్తి పొందుతారని… అలాంటి వ్యక్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. కెప్టెన్ మంచి అంశాలను నేర్పాలన్నారు. వెంటనే సర్పరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెబుతారని తాను ఆశిస్తున్నట్టు అక్తర్ చెప్పారు.