బంధుత్వాలను ఇంటికే పరిమితం చేయండి.... బాబు వార్నింగ్

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… రాష్ట్రాన్ని దెబ్బతీసేందుకు ఏపీపై గద్దల్లా వాలుతున్నారని విమర్శించారు. ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఎక్కడా స్పందన లేదని… అందుకే జగన్‌, కేటీఆర్‌ హడావుడిగా భేటీ అయ్యారన్నారు. తాజా భేటీతో టీఆర్‌ఎస్‌- వైసీపీ మధ్య ముసుగు తొలగిపోయిందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు […]

Advertisement
Update:2019-01-17 04:57 IST

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… రాష్ట్రాన్ని దెబ్బతీసేందుకు ఏపీపై గద్దల్లా వాలుతున్నారని విమర్శించారు.

ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఎక్కడా స్పందన లేదని… అందుకే జగన్‌, కేటీఆర్‌ హడావుడిగా భేటీ అయ్యారన్నారు. తాజా భేటీతో టీఆర్‌ఎస్‌- వైసీపీ మధ్య ముసుగు తొలగిపోయిందన్నారు.

బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. తలసాని శ్రీనివాస్ లాంటి వారిని ఏపీలో ప్రచారానికి రప్పించి కులాల వారీగా ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నేతల వద్ద వ్యాఖ్యానించారు.

ఏపీలో ఆలయాల సందర్శనకు వచ్చిన తలసాని రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇకపై ఏపీలో టీఆర్‌ఎస్ నేతలకు టీడీపీ నాయకులెవరూ ఆహ్వానాలు పలకవద్దని, టీఆర్‌ఎస్ నేతల పర్యటనల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బంధుత్వాలు ఉంటే ఇంటికే పరిమితం చేసుకోవాలన్నారు.

Tags:    
Advertisement

Similar News