భేటీ అనంతరం మీడియాతో కీలక విషయాలు చెప్పిన జగన్, కేటీఆర్‌

ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చల అనంతరం జగన్‌, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కేసీఆర్‌ స్వయంగా ఏపీకి వెళ్లి జగన్‌తో భేటీ అయి మిగిలిన అంశాలపై చర్చిస్తారని కేటీఆర్ వివరించారు. జగన్‌ తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ వేదికగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారని కేటీఆర్‌ వివరించారు. ఇప్పుడు జరిగింది కేవలం మొదటి సమావేశమేనని… త్వరలోనే కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో మరిన్ని […]

Advertisement
Update:2019-01-16 09:11 IST

ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చల అనంతరం జగన్‌, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కేసీఆర్‌ స్వయంగా ఏపీకి వెళ్లి జగన్‌తో భేటీ అయి మిగిలిన అంశాలపై చర్చిస్తారని కేటీఆర్ వివరించారు. జగన్‌ తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నామన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ వేదికగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారని కేటీఆర్‌ వివరించారు. ఇప్పుడు జరిగింది కేవలం మొదటి సమావేశమేనని… త్వరలోనే కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో మరిన్ని అంశాలపై చర్చిస్తారని కేటీఆర్‌ వెల్లడించారు.

ఫెడరల్ ఫ్రంట్‌ గురించి చర్చించామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించామన్నారు. రాష్ట్రాలకు మంచి జరగాలంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదాకే దిక్కులేకుండా పోయిందని… ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే ప్రాంతీయ పార్టీలు విడివిడిగా పోరాటం చేస్తే సాధ్యం కాదన్నారు.

ఏపీకి చెందిన 25 మంది ఎంపీలతో పాటు తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా ఏకం అయితే…. ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు గళమెత్తితే ఏపీకి మంచి జరుగుతుందన్నారు. కాబట్టి ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాంతీయ పార్టీలు ఏకమైతేనే జాతీయ పార్టీలు మాట వినే పరిస్థితి ఉంటుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామన్నారు. భేటీలో కేసీఆర్‌ కూడా తనతో ఫోన్‌లో మాట్లాడారన్నారు. చర్చలను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో…. ఎంపీల సంఖ్యా బలం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News