రెండేళ్లుగా గ్యాంగ్ రేప్‌...వీడియోతో బ్లాక్‌మెయిల్ చేస్తూ....

హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఒక బాలిక రెండేళ్లుగా గ్యాంగ్‌రేప్‌కు గురవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తీవ్రతను గుర్తించిన కమిషనర్‌ అంజనీ కుమార్‌… సీసీఎస్‌కు అప్పగించారు. తొలుత ఒక వ్యక్తి మత్తు మందు ఇచ్చి బాలికను రేప్‌ చేశాడు. దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ వీడియో సాయంతో మరో 10 మంది బాలికపై దారుణానికి రెండేళ్లుగా వడిగడుతున్నారు. హైదరాబాద్‌ కామాటిపురలో ఒక ఆయిల్‌ వ్యాపారి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం […]

Advertisement
Update:2019-01-14 00:59 IST

హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఒక బాలిక రెండేళ్లుగా గ్యాంగ్‌రేప్‌కు గురవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తీవ్రతను గుర్తించిన కమిషనర్‌ అంజనీ కుమార్‌… సీసీఎస్‌కు అప్పగించారు.

తొలుత ఒక వ్యక్తి మత్తు మందు ఇచ్చి బాలికను రేప్‌ చేశాడు. దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ వీడియో సాయంతో మరో 10 మంది బాలికపై దారుణానికి రెండేళ్లుగా వడిగడుతున్నారు.

హైదరాబాద్‌ కామాటిపురలో ఒక ఆయిల్‌ వ్యాపారి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ఒకసారి సదరు వ్యాపారి కుమార్తె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో సమీప బంధువైన రాజేశ్‌ వెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి 16 ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టి దాన్ని రికార్డు చేశాడు.

విషయాన్ని బయటకు చెబితే వీడియోను అందరికీ చూపించి పరువు తీస్తానంటూ అమ్మాయిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా కొద్దిరోజుల తర్వాత ఆ వీడియోను మరికొందరు స్నేహితులకు షేర్ చేశాడు. అలా ఆ వీడియో 10 మందికి చేరింది. వారు కూడా ఆ వీడియో సాయంతో అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.

ఈ వ్యవహారంలో రాజేశ్‌తో పాటు అభిజిత్, శుభమ్‌ కీలక పాత్ర పోషించారు. అయితే వారి నుంచి వేధింపులు మరీ ఎక్కువైపోవడంతో బాలిక తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్‌, శుభమ్‌, అభిజిత్‌ను అరెస్ట్ చేశారు. అయితే బాలికపై అత్యాచారం చేసిన వారిలో ఒకడైన విజయ్‌ను పోలీసులు నిందితుడిగా కాకుండా సాక్షిగా చేర్చడంతో బాలిక బంధువులు ఆదివారం కామాటిపురా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

విజయ్‌ కూడా తనపై దారుణానికి ఒడిగట్టాడని బాలిక పోలీసుల సమక్షంలోనే చెప్పారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. విజయ్‌ని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మిగిలిన నిందితులను కూడా 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితురాలి బంధువులు ఆందోళన విరమించారు. కేసు తీవ్రత దృష్ట్యా దీన్ని సీసీఎస్‌ పోలీసులకు బదిలీ చేస్తున్నట్టు కమిషనర్ అంజనీకుమార్‌ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News