పాతబస్తీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పక్కా సమాచారంతో ఓ వ్యభిచార ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు

Advertisement
Update:2025-02-25 15:50 IST

హైదరాబాద్ ఓల్డ్ సీటీ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. గుట్టు చప్పుడు కాకుండా విదేశీ అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను చాదర్ ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 11 మంది అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు బర్మా అమ్మాయిలు, ఏడుగురు యువకులున్నారు. తెలంగాణ స్పెషల్ సెల్ పోలీసులు, చాదర్ ఘాట్ పోలీసుల సంయుక్త దాడులలో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. ఛాదర్ ఘాట్‌ లోని మూసానగర్ కేంద్రంగా గత కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు ముఠా సభ్యులు.

పశ్చిమ బెంగాల్ తో పాటు బర్మా దేశంలోని బోర్డర్ నుంచి యువతులు, మైనర్ బాలికలను తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ స్పెషల్ సెల్ పోలీసులు, చాదర్ ఘాట్ పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముఠా సభ్యుల్లో ఇద్దరు యువతులు, ఇద్దరు మైనర్ బాలికలు, ఏడుగురు యువకులు ఉన్నారు. పట్టుబడిన ముఠా సభ్యులలో ఇద్దరు యువతులు, ఇద్దరు మైనర్ బాలికలు,ఏడుగురు యువకులు, యువతులు,బాలికలు బర్మాకు చెందినవారిగా గుర్తించారు.

Tags:    
Advertisement

Similar News