సర్పంచ్‌గా పోటీ చేయలేక యువతి ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికలు ఒక వివాహిత ప్రాణాలు తీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని భర్త వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దిండి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రాధా వయసు 22 ఏళ్లు. ఎనిమిది నెలల క్రితమే గ్రామంలోని లింగమయ్యతో వివాహం జరిగింది. ఇంతలో సర్పంచ్ ఎన్నికలు రావడం, సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో భార్యను పోటీ చేయాల్సిందిగా లింగమయ్య ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా ఎన్నికల ఖర్చు కోసం పుట్టింటి నుంచి రూ. […]

Advertisement
Update:2019-01-13 12:02 IST

నల్లగొండ జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికలు ఒక వివాహిత ప్రాణాలు తీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని భర్త వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దిండి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రాధా వయసు 22 ఏళ్లు.

ఎనిమిది నెలల క్రితమే గ్రామంలోని లింగమయ్యతో వివాహం జరిగింది. ఇంతలో సర్పంచ్ ఎన్నికలు రావడం, సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో భార్యను పోటీ చేయాల్సిందిగా లింగమయ్య ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా ఎన్నికల ఖర్చు కోసం పుట్టింటి నుంచి రూ. 5లక్షలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు.

డబ్బు కోసం పుట్టింటికి పంపించాడు. పుట్టింటి వారు కూడా డబ్బును సమకూర్చలేకపోయారు. దీంతో పుట్టింటిలోనే ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాధా కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Similar News